Tuesday, October 28, 2025 04:51 AM
Tuesday, October 28, 2025 04:51 AM
roots

కర్ణాటకలో గోరంట్ల మాధవ్.. రక్షణ కల్పిస్తోంది ఎవరూ…?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలను అలాగే ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన వారిని ఒక్కొక్కరిని అరెస్టు చేయడంతో ఎప్పుడు.. ఎవరిని అరెస్టు చేస్తారో అర్థం కాక పార్టీ అధిష్టానం తల పట్టుకుంటుంది. ఇక త్వరలోనే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేసే అవకాశం ఉంది అనే ప్రచారం గట్టిగానే జరుగుతున్నది. ఇటీవల ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన ఈనెల 5న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గోరంట్ల మాధవ్ రెచ్చిపోయి మాట్లాడారు.

Also Read : మెగా ఫ్యాన్స్ కు మళ్ళీ వెయిటింగ్ తప్పదా…?

ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ టార్గెట్ గా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీనితో ఆయనపై కేసు నమోదు అయింది. అదే విధంగా వాసిరెడ్డి పద్మ కూడా గోరంట్ల మాధవ్ పై ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ కేస్ పై పోలీసుల త్వరలోనే ఆయన విచారించనున్నారు. ఇక గోరంట్ల మాధవ్ ను పక్కాగా అరెస్టు చేసే అవకాశం ఉంది అనే వార్తలు రావడంతో గోరంట్ల మాధవ్ ప్రస్తుతం బెంగళూరు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. జగన్ సన్నిహితుడు ఇంట్లో ఆయన ఆశ్రయం పొందుతున్నారని వార్తలు వస్తున్నాయి.

Also Read : ఒంటిపూట బడులపై ఏపీ సర్కార్ క్లారిటీ..!

కర్ణాటకకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు గోరంట్ల మాధవ్ కు రక్షణ కల్పిస్తున్నట్లుగా మీడియా వర్గాలు అంటున్నాయి. మాధవ్ ను అరెస్టు చేస్తే ఆయన ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశం లేదనే క్లారిటీ వైసీపీ అగ్రనాయకత్వానికి వచ్చింది. అరెస్ట్ అయిన వారిపై కేసులపై కేసులు పెట్టడంతో గోరంట్ల మాధవ్ ను కూడా అలాగే ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని భావించి… కాపాడేందుకు ఆ పార్టీ అధిష్టానం కష్టాలు పడుతోంది. ఇటీవల వల్లభనేని వంశీ మోహన్ ను అరెస్టు చేసిన సమయంలో ఆయనపై పలు కేసులను బయటకు లాగారు. ఇక పోసాని కృష్ణమురళి విషయంలో కూడా ఇలాగే జరిగింది. త్వరలోనే మరి కొంతమందిని కూడా ఇలాగే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్