కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేసింది. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే 700 పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. జస్ట్ వాట్సప్‌లో హాయ్ అని మెసేజ్ పంపిస్తే చాలు.. ఏ సేవ కావాలో క్లియర్‌గా వచ్చేస్తుంది. అది బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, హాల్ టికెట్, ఆర్టీసీ టికెట్.. ఇలా ఏదైనా సరే.. హాయ్ అనే మెసేజ్‌తో మన ఫోన్‌లోకి వస్తుంది. ఆలయాల టికెట్లు బుకింగ్ సహా ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఈ సేవలు మరింత విస్తరిస్తామని సీఎం చంద్రబాబు కూడా స్పష్టం చేశారు.
Also Read : కేసులంటే అంత భయం ఎందుకో..!
ఇక ఐదేళ్ల వైసీపీ విధ్వంసక పాలనలో అన్ని వర్గాలు అస్తవ్యస్తమయ్యాయి. అది పంచాయతీ కార్యాలయం మొదలు.. రాష్ట్ర సచివాలయం వరకు అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. చివరికి ఆలయాల్లో కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కోలువైన దివ్య క్షేత్రం తిరుమల. ఏడుకొండల వాడి దర్శనానికి ప్రతి రోజు లక్షల మంది తిరుమల వస్తుంటారు. ఇక ప్రతి రోజూ సుమారు 70 వేల మంది స్వామిని దర్శించుకుంటారు. ఇక తిరుమల అంటే.. అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకు వస్తుంది. గతంలో కేవలం ఒకటి, రెండు లడ్డూలు మాత్రమే ఇచ్చారు. అయితే ప్రత్యేక పోటు నిర్మించిన తర్వాత వాటిపై ఉన్న పరిమితిని ఎత్తి వేశారు. స్వామి దర్శనం చేసుకున్న వారికి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. ఇవి తీసుకునేందుకు కొన్నిసార్లు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో తిరుమలలో అన్ని వ్యవస్థల్లో మార్పులు జరుగుతున్నాయి. ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ మొదలు.. లడ్డూ విక్రయాల వరకు అంతా కంప్యూటరైజేషన్ చేస్తున్నారు. ఇకపై లడ్డూ ప్రసాదం కోసం క్యూ లైన్‌లో వేచి ఉండాల్సిన అవసరం లేదంటున్నారు ఆలయ అధికారులు. కేవలం క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తారంటున్నారు. పేమెంట్ కూడా ఆన్ లైన్ ద్వారానే చేసేలా ఏర్పాట్లు చేశారు. అంటే మరింత పారదర్శకంగా లడ్డూలను భక్తులకు అందించనున్నారు. దీని కోసం ప్రత్యేక యంత్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది.
Also Read : విమర్శల దెబ్బకు వెనక్కు తగ్గిన గంభీర్.. టీంలో భారీ మార్పులు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం టీటీడీ నూతన విధానం ప్రవేశపెట్టింది. భక్తులు మరింత సులువుగా లడ్డూలను కొనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సదుపాయం ద్వారా భక్తులకు క్యూ లైన్ కష్టాలు తీరనున్నాయి. అలాగే లడ్డూలు కూడా చాలా సులువుగా భక్తులకు అందుతున్నాయి. ప్రస్తుతం దర్శనం మొదలు, వసతి గదులు సహా అన్ని వ్యవస్థల్లో నగదు లేకుండా పారదర్శక లావాదేవీలను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా లడ్డూ కౌంటర్ల సమీపంలో సకూడా కియోస్క్ మిషన్ ద్వారా లడ్డూలను సులువుగా భక్తులు పొందుతున్నారు.
ఈ కియోస్క్ మిషన్‌లో 2 ఆప్షన్లున్నాయి. ఒకటి దర్శనం టికెట్ ఉన్నవారు.. రెండోది దర్శనం టికెట్ లేని వారు. టికెట్ ఉన్న వారు వివరాలు నమోదు చేస్తే.. దర్శనం చేసుకున్నారా.. లేదా అనే వివరాలు స్క్రీన్ పై వస్తాయి. అలాగే టికెట్‍లో ఎంత మంది ఉన్నారనే వివరాలు కూడా వస్తాయి. టికెట్‌లో ఉన్న వ్యక్తుల ఆధారంగా ప్రతి ఒక్కరికీ 2 అదనపు లడ్డూలు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఇక దర్శనం టికెట్ లేని వారు అయితే ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అలా చేసిన వారికి మాత్రమే 2 లడ్డూలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. యూపీఐ ద్వారా పేమెంట్ చేసిన తర్వాత రశీదు వస్తుంది. ఆ రశీదుతో ఏ కౌంటర్ దగ్గరికి అయినా సరే నేరుగా వెళ్లి లడ్డూలు పొందవచ్చు. భక్తుల సౌకర్యార్థం టిటిడి ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి నుండి విశేష స్పందన లభిస్తోంది.




