లీడ్స్ లో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యాలు. బూమ్రా బౌలింగ్ లో వదిలేసిన క్యాచ్ లు జట్టు కొంప ముంచాయి. అసలు ఓడిపోవడానికి ఏ రూపంలో కూడా అవకాశం లేని మ్యాచ్ లో భారత్ ఓడిపోవడానికి జైస్వాల్ వదిలేసిన క్యాచ్ లు అనే చెప్పాలి. మొదటి ఇన్నింగ్స్ లో రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 5 క్యాచ్ లు వదిలేసాడు. దీనితో ఇంగ్లాండ్ 200 పరుగులకు పైగా లాభపడింది అనే మాట వాస్తవం. దీనితో అతనిని స్లిప్ నుంచి తప్పించాలని డిమాండ్ లు వినిపించాయి.
Also Read : వైసీపీ మైండ్ గేమ్.. వర్కవుట్ అవుతుందా..?
ఈ విషయంలో సీరియస్ గా ఉన్న హెడ్ కోచ్ గంభీర్.. స్లిప్ లో ఫీల్డింగ్ కు గాను సాయి సుదర్శన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. సాయి సుదర్శన్ తో గల్లీలో ఫీల్డింగ్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక జైస్వాల్ కు ఫీల్డింగ్ నేర్పించేందుకు.. గంభీర్ స్వయంగా సమయం కేటాయించాడు. ఇక భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డేష్ కాటే సోమవారం మీడియాతో మాట్లాడుతూ, జైస్వాల్‌ను స్లిప్-క్యాచింగ్ నుంచి తప్పిస్తున్నామని వెల్లడించాడు. తుది జట్టులో అతను ఉన్నా సరే ఫీల్డింగ్ లో ప్రాధాన్యత తగ్గనుంది.
Also Read : ఆ నలుగురికి చంద్రబాబు మాస్ వార్నింగ్..!
ఇక రెండో టెస్ట్ కు గానూ.. వాషింగ్టన్ సుందర్ తో పాటుగా అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం కనపడుతోంది. అర్షదీప్ సింగ్ కు ఇంగ్లాండ్ లో మంచి అనుభవం ఉన్న నేపధ్యంలో అతనిని తుది జట్టులోకి తీసుకుంటారు. ఇక బౌలింగ్ కంటే బ్యాటింగ్ లో జట్టుకు అండగా నిలబడే.. సుందర్ తో మంచి ఫలితం ఉంటుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. అటు ఇంగ్లాండ్ దాదాపుగా మొదటి టెస్ట్ లో ఆడిన జట్టునే రెండో టెస్ట్ కు సైతం కొనసాగిస్తోంది.