అంతర్జాతీయ క్రికెట్ లో కోచ్ పాత్ర చాలా ఎక్కువ. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో కోచ్ కు ఉన్న అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యూహాలు రచించడంతో పాటుగా ఆటగాళ్లను సమర్ధవంతంగా వినియోగించడం వంటివి ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. ఫీల్డింగ్ విషయంలో జట్టుకు కోచ్ సలహాలే కీలకం కూడా. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి జట్లు తమ ఆటగాళ్లకు.. మాజీల నుంచి సహకారం లభించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాయి. కోచ్ ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి.
Also Read : జగన్ కొత్త ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
కాని భారత జట్టు మాత్రం ఇప్పుడు కోచ్ రూపంలో సమస్యను ఎదుర్కొంటుంది. హెడ్ కోచ్ గంభీర్ నిర్ణయాలు జట్టును ఇబ్బంది పెట్టేస్తున్నాయి. విరాట్ కోహ్లీ రిటైర్ కావడం వెనుక గంభీర్ దే ప్రధాన పాత్ర అనేది చాలా మంది అభిప్రాయం. ఇక కెప్టెన్ గా సీనియర్ ఆటగాళ్ళు ఉన్న సమయంలో గిల్ కు బాధ్యతలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. అర్శదీప్ సింగ్ లాంటి స్వింగ్ బౌలర్ ను పక్కన పెట్టడం మరింత ఆశ్చర్యపరిచింది. సిరాజ్ ప్రదర్శన బాగాలేదని తప్పించిన సెలెక్టర్లు అతడిని మళ్ళీ జట్టులోకి తీసుకోవడం షాక్ కు గురి చేసింది.
Also Read : మాట నెగ్గించుకున్న అమ్రాపాలి
కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 9 టెస్ట్ లలో భారత్ కేవలం ఒక్కటే గెలిచింది. ఒకటి డ్రా చేసుకుంది.. బంగ్లాదేశ్ కూడా గత 9 టెస్ట్ లలో రెండు గెలిచింది. గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి స్వదేశంలో వైట్ వాష్ ఎదురైంది భారత్ కు. న్యూజిలాండ్ చేతిలో వరుసగా మూడు టెస్ట్ లు ఓడిపోయింది. శ్రీలంకలో 27 ఏళ్ళ తర్వాత వన్డే సీరీస్ ఓడిపోయింది. పదేళ్ళ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయింది భారత జట్టు. 370 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక చేతులు ఎత్తేసింది.