ఆస్ట్రేలియా సీరీస్ అనగానే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. సినిమాలకు మించి క్రికెట్ ఫ్యాన్స్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గత రెండు పర్యాయాలు టీం ఇండియా ఈ సీరీస్ ను గెలవడంతో ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. ఇక గతంలో కంటే టీం ఇండియా ఇప్పుడు బలంగా కనపడుతున్న నేపధ్యంలో ఫలితం ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ కూడా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం, వచ్చే ఏడాది జరగనున్న ఫైనల్ కు ఈ విజయం కీలకం కావడంతో ఇండియా పోరాటంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
దీనితో టీం ఇండియా హెడ్ కోచ్ గంభీర్ జట్టు కూర్పుపై సీరియస్ గా ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో యువ ఆటగాళ్లను రంగంలోకి దించడానికి రెడీ అవుతున్నాడు. ముఖ్యంగా ఆసిస్ టూర్ కోసం నలుగురు ఆటగాళ్లను సిద్దం చేస్తున్నాడు గంభీర్. యువ బౌలర్ మయాంక్ యాదవ్, కేరళ బ్యాట్స్మెన్ సంజూ సామ్సన్, కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రానా, తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి విషయంలో గంభీర్ ఆసక్తి చూపిస్తున్నాడు. వీళ్ళలో సంజు మినహా మిగిలిన ముగ్గురు న్యూజిలాండ్ తో సీరీస్ కి ఎంపిక అయ్యారు.
Also Read : పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో అఖండ సీక్వెల్
నితీష్ రెడ్డిపై గంభీర్ చాలా నమ్మకంగా ఉన్నాడని అందుకే బంగ్లాదేశ్ తో టి 20 సీరీస్ లో ఆడించి టెస్ట్ చేసాడని, ఆసిస్ పిచ్ లపై పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ కావాల్సి ఉండటంతో అతనిని ఆడించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే సంజూ సామ్సన్ ను ఇప్పటికే రంజీలు ఆడాల్సిందిగా గంభీర్ సూచించాడు. ఇక హర్షిత్ రానాను కచ్చితంగా గంభీర్ న్యూజిలాండ్ సీరీస్ లో ఆడించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. మయాంక్ యాదవ్ విషయంలో కూడా గంభీర్ సీరియస్ గా ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఈ నలుగురిని ఎలా అయినా ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకు వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.