టీం ఇండియా హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టు ఎంపిక విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. సీనియర్ ఆటగాళ్ళు రిటైర్ కావడం, ఐపిఎల్ ప్రదర్శన ఆధారంగా కొందరు జట్టులోకి రావడం వంటివి విమర్శలకు దారి తీసాయి. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న టెస్ట్ సీరీస్ లో సైతం జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మొదటి టెస్ట్ ఓటమి నుంచి అభిమానులు ఇంకా బయటకు రాక ముందే, రెండో టెస్ట్ లో జట్టు ఎంపిక అభిమానులను మరింత ఇబ్బంది పెట్టింది.
Also Read : రెండో టెస్టులో భారత జట్టులో జరిగే మార్పులు ఇవే
దీనిని భారత సీనియర్ ఆటగాళ్ళు సైతం తప్పుబట్టారు. బుధవారం ఇంగ్లాండ్‌తో మొదలైన రెండో టెస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్ జట్టులోకి వచ్చారు. మొదటి టెస్ట్ లో ఫెయిల్ అయిన సాయి సుదర్శన్, ఠాకూర్ ను తప్పించారు. ఇక బూమ్రాకు రెస్ట్ ఇచ్చింది జట్టు. జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడంతో , బర్మింగ్‌హామ్‌లో జరిగే రెండో టెస్ట్ కు కుల్దీప్ యాదవ్‌కు అవకాశం లభిస్తుందనే వార్తలు వచ్చాయి. కాని బ్యాటింగ్ ను దృష్టిలో పెట్టుకుని సుందర్ కు అవకాశం ఇచ్చారు.
Also Read : రేవంత్ రెడ్డి – ఆరా మస్తాన్ ఫోన్ ట్యాపింగ్.. ఆధారాలతో బయటపెట్టిన సిట్
దీనిపై మాజీ కెప్టెన్ గంగూలి అసహనం వ్యక్తం చేసారు. కుల్దీప్‌ను ఎంపిక చేయకపోవడం నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి పిచ్‌పై టర్న్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుల్దీప్ ను తీసుకుంటే బాగుండేది అన్నాడు గంగూలి. బలపడాల్సింది బ్యాటింగ్ కాదని బౌలింగ్ అని, మొదటి టెస్ట్ లో మొత్తం 830 పరుగులు చేశారని, బ్యాటింగ్ లో లోపాలు తనకు కనపడలేదు అని బౌలర్లు భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఫెయిల్ అయినప్పుడు బ్యాటింగ్ మీద దృష్టి పెట్టడం ఏంటో తనకు అర్ధం కాలేదన్నాడు గంగూలి.