Tuesday, October 28, 2025 05:22 AM
Tuesday, October 28, 2025 05:22 AM
roots

ఓట్ల కోసం ఆల్‌ ఫ్రీ.. భారం ఎవరిపైనా..?

ఢిల్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఆల్‌ ఫ్రీ అంటున్నాయి. కేజ్రీవాల్ అయితే మధ్య తరగతి కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. ఈసారి డబ్బు ప్రభావం సైతం ఎన్నికల్లో కనిపిస్తోంది. ఉచితాలతో ఓట్లు కొనేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఓట్ల కోసం గల్లీల్లో నోట్లు పంచే సంస్కృతి సైతం వచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రాజకీయ పార్టీలన్నీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఆమ్‌ ఆద్మీపార్టీ మరో అడుగు ముందుకేసి… మధ్యతరగతి కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. మిడిల్‌ క్లాస్‌ ప్రజలు పన్నుల భారంతో నలిగిపోతున్నారని… ప్రభుత్వం నుంచి చాలా తక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని చెప్పుకొచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలోని వృద్ధులకు మెరుగైన వైద్యం, సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంగానే తాము సంజీవని పథకాన్ని ప్రారంభించామని గుర్తుచేశారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును తిరిగి వారి సంక్షేమానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యకు ప్రవేశపెట్టే బడ్జెట్‌ను 2 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతోపాటు… ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రిస్తామని కేజ్రీవాల్ హామీనిచ్చారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యకు రాయితీలిస్తామని ఆప్‌ మేనిఫెస్టో పేర్కొంది. ఆరోగ్య బడ్జెట్‌ను 10 శాతానికి పెంచడం… ఆరోగ్య బీమాపై పన్ను ఎత్తివేయడం ఆప్‌ మేనిఫెస్టోలో భాగమే. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచుతామని తెలిపింది. నిత్యావసరాలపై జీఎస్టీ తొలగిస్తామని వెల్లడించింది. సీనియర్‌ సిటిజన్స్‌ కోసం మరింత మెరుగైన పింఛను పథకాలు ప్రవేశపెట్టడం తమ ఉద్దేశమన్నారు అరవింద్ కేజ్రీవాల్. రైల్వేలో సీనియర్‌ సిటిజన్లకు 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. కేజ్రీవాల్‌ మధ్యతరగతి మేనిపెస్టోలో చాలా వరకు కేంద్రం చేయాల్సినవే ఉన్నాయి. దీంతో ఈ అంశాలను ఆప్‌ ఎంపీలు… పార్లమెంట్‌లో లేవనెత్తే అవకాశం ఉంది.

Also Read : బ్రేకింగ్: ఎన్డియేకి షాక్ ఇచ్చిన నితీష్

అటు ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకుంటోంది బీజేపీ. దీంతో యువత, నిరుపేదల ఓట్లే లక్ష్యంగా రెండో మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు 15 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించింది. ఐటీఐ, పాలిటెక్నిక్‌లాంటి సాంకేతిక విద్య అభ్యసించేవారికి ప్రతినెల రూ.వెయ్యి, ఆటో-ట్యాక్సీ డ్రైవర్‌ సంక్షేమ బోర్డు ఏర్పాటు, డ్రైవర్లకు రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామని హామీనిచ్చింది. నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తామని బీజేపీ తెలిపింది.

Also Read : దావోస్ లో లోకేష్ స్పీడ్.. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్

ఉచితాలపై హామీలివ్వడంలో ఢిల్లీలో పార్టీలు పోటీపడుతున్నాయి. బీజేపీ హామీల విషయానికొస్తే… ప్రతి మహిళలకు నెలకు రూ.2,500, గర్భిణులకు ఏటా రూ.21 వేలు, ఆరు పోషకాహార కిట్లు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, హోలీ, దీపావళికి ఉచిత సిలిండర్లు… 60-70 మధ్య వయసున్నవారికి నెలకు రూ.2,500 పింఛను, 70 ఏళ్లు దాటినవారికి, వితంతువులు, దివ్యాంగులకు రూ.3 వేల పింఛన్ల ఇస్తామంటున్నారు కమలం పార్టీ నేతలు. ఇక ఆమ్‌ ఆద్మీ సైతం ఢిల్లీలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,100, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం హామీలిచ్చింది. ఆడబిడ్డల వివాహానికి… రూ.లక్ష సాయం, అద్దెకు ఉండేవారికి ఉచిత విద్యుత్, మంచినీటి సరఫరాను ఆప్‌ మేనిఫెస్టోలో చేర్చింది. కాంగ్రెస్‌ పార్టీ మరో రెండడుగులు ముందుకేసి మరిన్ని ఉచిత హామీలనిచ్చింది. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికీ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.500 కే ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌, పేదలకు బియ్యం, చక్కెర, వంటనూనె, పప్పులు, టీ పొడితో కూడిన రేషన్‌ కిట్ల పంపిణీ, నిరుద్యోగ యువతకు నెలకు రూ.8,500 భృతి కల్పిస్తామంటూ హామీలిచ్చింది కాంగ్రెస్. ప్రతి వ్యక్తికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా ఇస్తామని చెప్పింది హస్తం పార్టీ.

Also Read : సరస్వతికి షాక్ ఇచ్చిన సర్కార్.. 25 ఎకరాలు లాగేశారు…!

ఉచితాలను ఇబ్బడిముబ్బడిగా ఇచ్చుకుంటూపోతే అభివృద్ధి కుంటుపడుతుందని గతంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే చెప్పారు. అయినా బీజేపీ సహా ఏ పార్టీ మాట వినే పరిస్థితుల్లో లేదు. ఆర్థిక వ్యవస్థపై, అభివృద్ధిపై తీవ్ర ప్రభావంపడ్డా సరే వెనక్కి తగ్గడం లేదు. ఓట్లు సంపాదించి.. అధికారంలో కూర్చోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి రాజకీయ పార్టీలు. ఢిల్లీ బడ్జెట్టు రూ.70వేల కోట్లు. అయితే ఒక్కో పార్టీ రూ.లక్ష కోట్లకు పైగా ఉచితాలకే ఖర్చు పెట్టేస్తామంటూ హామీలు ఇస్తున్నాయి. మహారాష్ట్ర లాంటి ధనిక రాష్ట్రమే లడ్కీ బెహనా పథకం అమలు చేసేందుకు ఏటా రూ.46 వేల కోట్లు ఎలా తీసుకురావాలో తెలియక తికమకపడుతోంది. ఏదీ ఉచితంగా లభించదు. కొందరికి లభించే ఉచితాలకు మరెవరో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది…. లేదా అప్పులు తెచ్చిపెట్టాల్సి రావొచ్చన్న సూక్ష్మాన్ని ఓటర్లు గ్రహించలేకపోతన్నారు. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో… డబ్బు పంపిణీ ప్రభావం కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్‌ ఉంది. గల్లీల్లో డబ్బులు పంచేందుకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయని సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్