Tuesday, October 21, 2025 12:32 PM
Tuesday, October 21, 2025 12:32 PM
roots

ఫ్రీ బస్.. రూల్స్ ఇవే.. వాళ్లకు కూడా నో చార్జ్

ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పెన్షన్ లు, తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం మీద దృష్టి సారించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఉదాహరణగా తీసుకుని ఏపీలో అమలు చేసేందుకు సిద్దమైంది.

Also Read : మళ్ళీ మొదలైన నందమూరి ఫ్యాన్ “వార్”..!

స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అమలు చేస్తారు. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తారు. 5 కేటగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం కలిపించనున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తారు. బాలికలు, మహిళలు, ట్రాన్సజెండర్లు బస్సుల్లో గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చు.

Also Read : రోజాకు మ్యూజిక్ స్టార్ట్.. పక్కా ప్రూఫ్స్ తో దొరికారా..?

తిరుమల – తిరుపతి మధ్య సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని పేర్కొంది. నాన్ స్టాప్, అంతరాష్ట్ర బస్సు సర్వీస్ లో ఉచిత ప్రయాణం వర్తించదని రవాణా శాఖ వెల్లడించింది. సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సులలో ఉచిత ప్రయాణం పథకం వర్తించదని తెలిపింది. అలాగే సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్,ఏసీ బస్సులకు ఉచిత ప్రయాణం పథకం వర్తించదని పేర్కొంది. బస్సులో రద్దీ పెరగనున్న దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కండక్టర్లకు బాడీ ఒర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. చార్జీ పై రాయితీ మొత్తాన్ని తెలుపుతూ జీరో ఫైట్ టికెట్ జారీకి ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

పోల్స్