Wednesday, April 8, 2026 12:18 PM
Wednesday, April 8, 2026 12:18 PM

అభిషేక్ వీక్నెస్ బయటపెట్టిన పాక్ మాజీ ప్లేయర్..!

టి20 వరల్డ్ కప్ లో అంచనాలకు మించి రాణిస్తాడు అని.. భారీ ఆశలు పెట్టుకున్న భారత క్రికెట్ అభిమానులకు.. స్టార్ ఆటగాడు అభిషేక్ శర్మ.. వరుస షాక్ లు ఇచ్చాడు. ఈ టోర్నీలో వరుసగా మూడు సార్లు డకౌట్ అయ్యాడు అభిషేక్. దీనితో అతని ఆట తీరు, టెక్నిక్, ఫుట్ వర్క్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది కాలంగా భారత జట్టు బ్యాటింగ్ కు అత్యంత కీలకంగా మారిన అభిషేక్.. టి20 ప్రపంచ కప్ లో ప్రతీసారి భారీ షాట్ కు ప్రయత్నం చేసి వికెట్ కోల్పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read : వైసీపీ దుష్ప్రచారానికి సుందర్ పిచాయ్ చెక్!

ఈ నేపధ్యంలో పాక్ మాజీ ఆటగాళ్ళు అతనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ అతనికి కీలక సలహా ఇచ్చాడు. అభిషేక్ ప్రతి డెలివరీ తన కంఫర్ట్ జోన్‌ లో పిచ్ కావాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తుందని, ప్రతి బంతిని బౌండరీగా కొట్టడానికి ప్రయత్నించవద్దని సలహా ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం పీఎస్ఎల్ కెరీర్ మొదలుపెట్టిన సైమ్ ఆయూబ్ కి కూడా ఇదే సమస్య ఉండేదని పేర్కొన్నాడు. దాదాపుగా నో-లుక్ షాట్లు కొట్టేవాడని తెలిపాడు.

Also Read : వీకెండ్ లో యుద్దమే..? రెడీ అయిన ట్రంప్..!

అభిషేక్ షాట్లు చాలా వరకు లెగ్ సైడ్‌లో ఉండటం వలన అతని బలహీనత ఎవరికీ అర్ధం కాలేదని.. ఇప్పుడు, మూడవ లేదా నాల్గవ స్టంప్ లైన్‌ లో బౌలింగ్ చేస్తే, అతను షాట్ సెలెక్షన్ లో ఇబ్బంది పడుతున్నాడని కామెంట్ చేసాడు. గత రెండు మ్యాచ్ లలో కూడా ఆఫ్ సైడ్‌లో ఆడుతూ ఔటయ్యాడని, అతను తన ఆఫ్-సైడ్ టెక్నిక్ మెరుగుపరుచుకోకపోతే, అతను కెరీర్ లో ముందుకు వెళ్ళలేడు అంటూ హెచ్చరించాడు. బలమైన బౌలర్లు ఎల్లప్పుడూ మీ బలహీనతను టెస్ట్ చేస్తారని, మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చేలా బౌలింగ్ చేస్తారని, కాబట్టి ఆఫ్ సైడ్ లో ఎక్కువ ఫోకస్ చేయాలని సూచించాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దేవాదాయ శాఖలో ఏసీబీ...

గత రెండేళ్ళ నుంచి ఏపీలో హాట్...

కేసీఆర్ బయటకు వస్తారా.....

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ...

తమిళనాడులో అలా.. మరి...

చట్టం అందరికీ సమానమే. బాధితులకు న్యాయం...

ఏబీఎన్‌పై వైసీపీ దాడి.....

హైదరాబాద్‌లోని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి కార్యాలయం...

ఏపీ లిక్కర్ స్కాంలో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం...

కవితను బుజ్జగించేందుకు రంగంలోకి...

బిఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలు ఇప్పుడు కల్వకుంట్ల...

పోల్స్