Tuesday, October 28, 2025 05:22 AM
Tuesday, October 28, 2025 05:22 AM
roots

మరో మాజీ మంత్రికి లిక్కర్ దెబ్బ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మరో అరెస్టుకు రంగం సిద్ధమైనట్లే కనపడుతుంది. మద్యం కుంభకోణంలో ప్రస్తుత రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం రెండు మూడు రోజుల నుంచి గట్టిగా జరుగుతోంది. చివరికి నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన సరే మిథున్ రెడ్డిని అరెస్టు చేయడానికి అధికారులు సాహసం చేయడం లేదు. ఆయన కోసం ఢిల్లీలో పాగా వేసిన అధికారులు కూడా ఆయన ఎక్కడున్నాడో తెలిసినా సరే అరెస్టు చేసే ప్రయత్నం చేయలేదు. చివరికి ఆయనే వచ్చి స్వచ్చందంగా లొంగిపోయే అవకాశం ఇచ్చారు.

Also Read : బెయిల్ ఇవ్వని సుప్రీం కోర్ట్.. అరెస్ట్ వద్దన్న ఏసీబీ కోర్ట్..!

ఇక ఇప్పుడు మరో మాజీ మంత్రి ని అరెస్టు చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి పి నారాయణస్వామి ని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించారు. పలు కీలక ఫైల్స్ పై ఆయన సంతకాలు కూడా చేశారు. మద్యం కుంభకోణంలో వాటిని కీలకంగా భావిస్తుంది ప్రత్యేక దర్యాప్తు బృందం.

Also Read : అసలు వాళ్లంతా ఏమయ్యారు.. ఎక్కడున్నారు..?

దీనితో ఆయన విచారణకు రావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే 11మంది నిందితులనుంచి కీలక సమాచారాన్ని రాబట్టిన అధికారులు.. నారాయణస్వామి పాత్రపై విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలన్ని కీలకంగా తీసుకున్నట్లు సమాచారం. అలాగే మద్యం నిందితుల్లో ఒకరు నారాయణస్వామి పేరును స్పష్టంగా బయట పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వాటి ఆధారంగానే ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్