Saturday, September 13, 2025 03:22 AM
Saturday, September 13, 2025 03:22 AM
roots

విదేశీ ఆటగాళ్ళు వచ్చేస్తున్నారు.. ఐపిఎల్ కు స్టార్ లు

ఇటీవల భారత్ – పాక్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం కారణంగా వాయిదా పడిన.. ఐపిఎల్ మ్యాచ్ ల షెడ్యూల్ ను మళ్ళీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో విదేశీ ఆటగాళ్ళు తిరిగి భారత్ కు వస్తారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళ విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఉన్న నేపధ్యంలో.. ఇరు జట్లు ఆ మ్యాచ్ పై ఫోకస్ చేసాయి. దీనితో పలు జట్ల స్టార్ ఆటగాళ్ళు భారత్ వచ్చే అవకాశం లేదని భావించారు.

Also Read : కోహ్లీ ఆస్తుల విలువ తెలుసా..?

కానీ.. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో పాటుగా ఇతర దేశాల ఆటగాళ్ళు కూడా భారత్ చేరుకున్నారు. ఫాస్ట్ బౌలర్లు జోష్ హాజిల్‌వుడ్, లుంగి ఎంగిడి తిరిగి ఆర్సీబీ జట్టులో చేరనున్నారు. ఈ నెల 17 న జరగబోయే మ్యాచ్ కు వీరు అందుబాటులో ఉండనున్నారు. వారు నాకౌట్ దశకు అందుబాటులో లేకుంటే, శ్రీలంక పేసర్ నువాన్ తుషారను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ యువ బ్యాట్స్‌మన్ జాకబ్ బెథెల్, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు.

Also Read : బాబు సర్కార్ కీలక నిర్ణయం.. జగన్‌పై కూడా ఎఫెక్ట్..!

ఇంగ్లాండ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ కూడా తిరిగి భారత్ వచ్చేసాడు. పాయింట్ల పట్టికలో 11 ఆటల్లో 16 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో జట్ల మధ్య పోటీ నెలకొంది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మరియు ఆస్ట్రేలియన్ ఫినిషర్ టిమ్ డేవిడ్ కూడా జట్టులో చేరనున్నారు. అయితే వీళ్ళు అందరూ టోర్నీ మొత్తం అందుబాటులో ఉంటారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్ళు మాత్రం ముందే ఇంగ్లాండ్ వెళ్ళే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్