Friday, September 12, 2025 10:39 PM
Friday, September 12, 2025 10:39 PM
roots

ఏపీపై కేంద్రం మరోసారి స్పెషల్ లవ్

2024 లో విజయవాడ వరదలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఎప్పుడు లేని విధంగా విజయవాడ వరదలతో ఇబ్బందులు పడింది. వాస్తవానికి విజయవాడలో ఎండ మాత్రమే ప్రజలకు సుపరిచితం. వరదలు చాలా అరుదు.. వరదలు వచ్చినా కృష్ణ నది కారణంగా.. కృష్ణలంక సహా కొన్ని ప్రాంతాలు మాత్రమే మునుగుతాయి. కానీ బుడమేరు కారణంగా విజయవాడ నగరం దాదాపుగా 40 శాతం మునిగింది. ఒక్కరోజు కురిసిన భారీ వర్షానికి విజయవాడ అతలాకుతలం అయిపోయింది.

Also Read : జగన్ కామెంట్స్ తో డైలమాలో వైసీపీ సోషల్ మీడియా

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తనవంతు సహాయంగా రాష్ట్రానికి అండగా నిలుస్తూ వచ్చింది. తాజాగా ఐదు రాష్ట్రాలకు విపత్తులు వరద సాయం కింద బుధవారం నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. విపత్తు, వరదల సాయం కింద ఐదు రాష్ట్రాలకు మొత్తం 1555 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటుగా నాగాలాండ్, ఒడిస్సా, త్రిపుర రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం గమనార్హం.

Also Read : వైసీపీ ప్రతాపం అంతా అక్కడేనా?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిధుల విడుదలకు ఆమోదం లభించింది. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో 608 కోట్ల కేటాయించగా.. తెలంగాణకు 231 కోట్ల కేటాయించింది కేంద్రం. ఇక నాగాలాండ్ కు 170 కోట్లు, ఒరిస్సా కు 255 కోట్లు, త్రిపుర కు 258 కోట్ల రూపాయలను కేంద్రం రిలీజ్ చేసింది. ఇప్పటికే వరద బాధిత రాష్ట్రాలకు కొంత నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరోసారి నిధులు విడుదల చేసింది. విపత్తులు వరదలు వలన నష్టపోయిన ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర బృందాలు పర్యటించి నివేదికలు ఇచ్చాయి. ఈ మేరకు వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నేడు నిధులు విడుదల చేసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్