Tuesday, October 28, 2025 01:30 AM
Tuesday, October 28, 2025 01:30 AM
roots

ప్రత్యేక హోదాకు 5 అర్హతలు, ఏపీకి రానట్లేనా?

గత పదేళ్ళ నుంచి విభజన హామీల్లో అత్యంత కీలకంగా నలుగుతున్న ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అవకాశం లేదా…? ప్రత్యేక హోదాను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే వారికి కేంద్రం పార్లమెంట్ వేదికగా ఇచ్చిన సమాధానం చెంపపెట్టు కానుందా…? ప్రత్యేక హోదాతో తమను ఇబ్బంది పెట్టలేరని కేంద్ర పెద్దలు సంకేతాలు ఇచ్చేసారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. బీహార్ కి ప్రత్యేక హోదా గురించి ఈ రోజు పార్లమెంట్ లో జరిగిన బడ్జెట్ సమావేశం లో బీహార్ కి చెందిన జేడీయూ ఎంపీ మండల్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అడిగారు.

సదరు ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి హోదా పొందటానికి ఉండాల్సిన 5 అర్హతలు ఏంటీ అనేది లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆ అర్హతలలో సగం బీహార్ కు లేవని స్పష్టం చేసారు. సదరు విషయాన్ని ఇంటర్ మినీస్టీరియల్ గ్రూప్ (IMG) నివేదిక ఇచ్చిందని లిఖిత పూర్వకంగా ఆయన పేర్కొన్నారు. అసలు ఆ 5 అంశాలు ఏంటో చూద్దాం.

– పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం
– తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా అధికం
– పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం
– ఆర్థిక, పారిశ్రామిక వెనుకబాటుతనం
– రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం

నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచించిన ఈ అర్హతలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారని.. తాజాగా బిహార్ కు ఈ అర్హతల్లేవని కేంద్రం స్పష్టంగా చెప్పింది. దీని ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ కు కూడా హోదా ఇచ్చే అవకాశం లేనట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. బీహార్ తో పోలిస్తే ఏపీకి మెరుగైన అవకాశాలే ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి మాత్రమే వెనుకబడి ఉంది ఏపీలో. పారిశ్రామికంగా గత ప్రభుత్వ విధానాలతో ఏపీ వెనుకబడింది అనే ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్