వైసీపీ అధినేత వైయస్ జగన్ ఏం చేసినా సరే సెన్సేషనల్ గానే ఉంటుంది. ఆయన మాట్లాడే మాటలకు మీడియాలో హడావుడి అలాగే ఉంటుంది. లేటెస్ట్ గా జగన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదం కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతుంది. బుధవారం మధ్యాహ్నం అలాగే సాయంత్రం, రాత్రి ఆయన ఇంటి బయట జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక జగన్ 2.0 వెర్షన్ చూస్తారని ఆయన కామెంట్ చేసిన కాసేపటికే అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Also Read : 1 కాదు.. 2 కాదు.. మూడు.. రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ లెక్క మారింది…!
దీనిపై టిడిపి ఇంట్రెస్టింగ్ గా రియాక్ట్ అయింది. సిట్టు పడింది.. తగలబడింది అంటూ టిడిపి ఎక్స్ లో ఒక పోస్ట్ చేసింది. ఉదయం లిక్కర్ స్కామ్ లో సిట్ పడిందని రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిందని… ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటని సోషల్ మీడియాలో ప్రశ్నించింది. సిట్ తన ఇంటి వరకు వస్తుందని.. ముందే లిక్కర్ స్కాంకు సంబంధించిన తాను రాసుకున్న లెక్కలు డాక్యుమెంట్లను తగలబెట్టారా అని ప్రశ్నించింది. నిన్న సాయంత్రం జరిగితే ఇప్పటివరకు తన ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదని నిలదీసింది.
Also Read : రామ్ కోసం బాలయ్య.. ఫేట్ మారుతుందా..?
తానే తగలబెట్టి ప్రభుత్వం మీద తోసేయడమే 2.0నా అంటూ ప్రశ్నించింది. ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదని, సిట్ వస్తుందని విచారణ చేస్తుందని, నీ అవినీతిని బయటకు తీస్తుందని రెడీగా ఉండాలంటూ స్టే ట్యూండ్ టు తాడేపల్లి ఫైల్స్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇంకా అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే అగ్నిమాపక సిబ్బందికి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎవరూ సమాచారం ఇవ్వలేదు. సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం సమయంలో మాత్రమే సమాచారం ఇచ్చారు. అయితే వైసీపీ మాత్రం జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు వైరల్ చేస్తుంది.