క్రికెట్ విషయంలో టీం ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. ఎంత పట్టుదలగా ఉంటాడో.. మరోసారి ప్రూవ్ అయింది. కోహ్లీ డెడికేషన్ ను.. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ మరోసారి నిరూపించింది. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నా.. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు మైదానంలోకి అడుగుపెట్టి తన వంతు బాధ్యతను నెరవేర్చాడు కోహ్లీ. కోహ్లీ చూపిన ఈ క్రీడా స్ఫూర్తిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా కోహ్లీ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం.
Also Read : ఏపీలో ఆన్లైన్ బెట్టింగ్ పై డీజీపీ సంచలన ఆదేశాలు..!
దానికి తోడు నిన్నటి మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే అతని మడమకు స్వల్ప గాయమైంది. అయినప్పటికీ, కోహ్లీ వెనక్కి తగ్గకుండా 38 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. కోహ్లీ పడుతున్న ఇబ్బందిని గమనించిన మాజీ కోచ్ రవిశాస్త్రి, కామెంటరీలో ఈ అంశాన్ని ప్రస్తావించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ పై 1,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.
Also Read : వైసీపీపై పయ్యావుల, నిమ్మల, అచ్చెన్నల త్రిశూల వ్యూహం..!
జ్వరంతో ఇబ్బంది పడుతూనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. అయితే, బ్యాటింగ్ ముగిసిన తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆయన ఫీల్డింగ్‌కు రాలేదు. కోహ్లీ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ మైదానంలోకి వచ్చాడు. కోహ్లీ ఆరోగ్యంపై క్లారిటీ రావడంతో అభిమానులలో ఆందోళన మొదలైంది. మ్యాచ్ గెలిచినా.. కోహ్లీ ఆరోగ్యంపై ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. వచ్చే మ్యాచ్ నాటికి ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు ముంబై ప్లేయర్ రోహిత్ శర్మ కూడా గాయపడటంతో ఇద్దరు స్టార్ ప్లేయర్ల ఫిట్‌నెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

