Saturday, September 13, 2025 07:05 AM
Saturday, September 13, 2025 07:05 AM
roots

ఫ్యామిలీ పాలిటిక్స్… అన్నీ వాళ్లకేనా…!

రాజకీయాల్లోకి ఒకసారి వస్తే చాలు… ఇక తరతరాలు గడిచిపోతాయనేది నానుడి. ఒకరి తర్వాత ఒక్కొక్కరుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటారు. కొంత మంది అయితే ఆయా నియోజకవర్గాలను తమ సొంత జాగీరులా చేసుకుని… మరొకరికి అవకాశం కూడా ఇవ్వరు. ఇప్పుడు ఏపీలో కుటుంబ పాలన నడుస్తుందనేది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కొన్ని కుటుంబాల పెత్తనం తారాస్థాయికి చేరుకుందనే మాట ఇప్పుడు కొందరు నేతలు, కార్యకర్తలను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కొన్ని కుటుంబాల నుంచి అయితే ఒకటికి మూడు నాలుగు పదవులు కూడా దక్కించుకున్న నేతలున్నారు.

Also Read : మావ పాలన మరిచిన అల్లుడు.. సభ నిర్వహణపై పెద్ద పెద్ద మాటలు

ప్రధానంగా కష్టపడిన వారికే పదవులు, అవకాశం అని అధినేత చంద్రబాబు చెప్తున్నప్పటికీ… వాస్తవానికి ఒకరు వస్తే చాలు.. వారి తర్వాత మరొకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఆ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉండే ఫ్యామిలీ కింజరాపు. ఎర్రన్నాయుడు రాజకీయ వారసునిగా అచ్చెన్నాయుడు, ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవానీ, ఇప్పుడు ఆదిరెడ్డి శ్రీనివాస్… ఇదే ఫ్యామిలీకి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి పదవులతో పాటు ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చారు చంద్రబాబు. ఇప్పటికే ముగ్గురు ప్రజాప్రతినిధులున్నప్పటికీ… మళ్లీ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్‌ పదవిని మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ఇవ్వాలని అచ్చెన్నాయుడు పైరవీలు చేస్తున్నారు.

వీరి తర్వాత ఆ స్థాయిలో కీలకమైన ఫ్యామిలీ యనమల. 1995 సంక్షోభంలో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రామకృష్ణుడు.. ఆ తర్వాత ఎన్నో కీలక పదవులు అనుభవించారు. స్పీకర్‌, ఆర్థిక మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్నారు. ఇక 2004 నుంచి వరుసగా ఓడుతున్నప్పటికీ… యనమలను ఏదో ఒక రూపంలో చట్టసభకు పంపుతూనే ఉన్నారు చంద్రబాబు. రెండుసార్లు యనమల సోదరుడు కృష్ణుడికి టికెట్ ఇచ్చిన చంద్రబాబు… 2024 ఎన్నికల్లో యనమల కుమార్తె దివ్యకు టికెట్ ఇచ్చారు. అలాగే ఆయన అల్లుడు మహేశ్ యాదవ్‌కు ఎంపీ, వియ్యంకుడు సుధాకర్‌ యాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దివ్యను ప్రభుత్వ విప్‌గా కూడా ఎంపిక చేశారు. అయినా సరే… రామకృష్ణుడు మాత్రం మళ్లీ మంత్రి పదవి లేదా రాజ్యసభకు ఎంపిక చేయాలంటూ పైరవీలు చేస్తున్నారు.

ఇక వీరితో పాటు కిమిడి కళా వెంకట్రావు ఆయన వారసులు రామ్ మల్లిక్ నాయుడు, నాగార్జున కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిటాల రవి తర్వాత సునీత, శ్రీరామ్ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. భూమా నాగిరెడ్డి వారసులుగా అఖిల ప్రియ, బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. కేఈ మాదన్న తర్వాత రాజకీయాల్లోకి కేఈ కృష్ణమూర్తి, ప్రభాకర్ సోదరులు రాజకీయాల్లోకి రాగా… ఇప్పుడు మూడో తరం నేత శ్యాంబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గోతు లచ్చన్న వారసునిగా గౌతు శ్యామ్ సుందర్ శివాజీ… ఇప్పుడు మూడో తరం నేత గౌతు శిరీష. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పాతుకుపోయి ఉన్నారు. దీంతో కొత్తవారికి అవకాశం లేకుండా పోయిందనే మాట వినిపిస్తోంది.

Also Read : వై నాట్ పులివెందుల… వర్కవుట్‌ అవుతుందా…?

వీరితో పాటు ఇప్పుడు జనసేన పార్టీలో కూడా కుటుంబ రాజకీయాలు కొనసాగుతున్నాయనే మాట వినిపిస్తోంది. తమ్ముడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కాగా… చిన్నన్న నాగబాబుకు ఇప్పటికే క్యాబినెట్ బెర్త్ ఖరారైంది. ఇక పెద్దన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటికీ… దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ… మరోసారి జనసేన తరఫున అన్న చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా బీజేపీ అగ్రనేత అమిత్ షాతోనే మంతనాలు జరిపి ఒప్పించినట్లు సమాచారం. దీంతో ఏపీ రాజకీయాల్లో ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కువయ్యాయనే మాట బలంగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్