ఏపీలో ఇప్పుడు నిజమేదో… అబద్ధం ఏదో తెలుసుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం… సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారమే. ఇప్పటికే దీనిపై సైబర్ క్రైమ్‌లో ఎన్నో ఫిర్యాదులు ఉన్నప్పటికీ… ఫేక్ ప్రచారానికి మాత్రం బ్రేక్ పడటం లేదు. ఏపీలో కూటమి సర్కార్‌ను కించపరిచేలా… కొంతమంది పనిగట్టుకుని మరీ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు టీడీపీ అభిమానులు నానా పాట్లు పడుతున్నారు.

నిజం గడప దాటే లోపు… అబద్ధం ఊరు పొలిమేర దాటేస్తుందనే సామెత ప్రస్తుతం వైసీపీ నేతల తీరుకు సరిగ్గా సరిపోతుంది. ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా బీ.ఆర్.నాయుడును ప్రభుత్వం ప్రకటించింది. బీఆర్ నాయుడు పేరు ప్రకటించిన వెంటనే ముందుగా కులం పేరుతో ప్రచారం చేశారు. తన సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్లకే చంద్రబాబు పదవి ఇచ్చాడని ప్రచారం మొదలుపెట్టారు.

దీనికి టీడీపీ అభిమానులు ఘాటుగా బదులిచ్చారు. గతంలో జగన్ ప్రభుత్వంలో టీటీడీ ఛైర్మన్‌లు వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఏ సామాజికి వర్గానికి చెందిన వారని ప్రశ్నించారు. కులం పేరుతో రాజకీయం సరికాదని కౌంటర్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మరో ఫేక్ పోస్టును వైరల్ చేస్తున్నారు. బీఆర్ నాయుడు ఛాంబర్‌లోని షెల్ఫ్‌లో పైన విజయవాడ కనకదుర్గమ ఫోటో, రాధాకృష్ణుల బొమ్మలున్నాయి. వాటి కింద నంది బొమ్మతో పాటు ఓ షీల్డ్ కూడా ఉంది. అయితే ఆ షీల్డ్‌పైన సిలువ మార్క్‌ను పేస్ట్ చేసిన సైబర్ కేటుగాళ్లు… సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైగా క్రిస్టియానిటీ ఫాలో అయ్యే బీఆర్ నాయుడుకు ఎలా ఇస్తార… ఇదే సనాతన హిందూ ధర్మమా అని కూడా పోస్ట్ చేశారు.
Also Read: అక్కడికి వచ్చే ధైర్యం జగన్ కి ఉందా?
దీనికి ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. ఒరిజినల్ ఫోటో పోస్ట్ చేసిన ఫ్యాక్ట్ చెక్… అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది కూడా. బీఆర్ నాయుడు హిందూధర్మం పేరుతో ఓ ఛానల్ నిర్వహిస్తున్నారు. అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకంగా కోటీ దీపోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. అయినా సరే… ఫేక్ రాయుళ్లు మాత్రం అబద్ధపు ప్రచారం చేసేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయటం లేదు. ఇలాంటి వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు, అభిమానులు కోరుతున్నారు.




