లిక్కర్ స్కాం పేరు వింటే చాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు వణికిపోతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా తమ పేరు ఈ స్కాంలో బయటకు వస్తుందో అని సీఎంలుగా చేసిన వాళ్ళు, సీఎంలుగా ఉన్న వాళ్ళు భయపడిపోతున్నారు. కష్టపడి నిర్మించుకున్న రాజకీయ భవిష్యత్తును కక్కుర్తి పడి మింగిన లిక్కర్ సొమ్ము ఖతం చేస్తుందా అంటూ వణికిపోతున్నారు. గుప్పిడి గట్టిగా బిగించుకుని తమను ఆ దేవుడే కాపాడాలంటూ కంగారు పడిపోతున్నారు.
Also Read : నారా లోకేష్ పైన ఇంత కోపం ఎందుకు..?
ఈ చండాలంలో ఇప్పుడు మరో మాజీ సీఎం ఎంట్రీ ఇచ్చారు. ఆయనే చత్తీస్ఘడ్ మాజీ సీఎం భూపేష్ భాగెల్. సమర్ధవంతమైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. కాని లిక్కర్ కిక్ మాత్రం ఆయన్ను వదలలేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ఈ రోత రాజకీయ నాయకులను వెంటాడుతున్న సమయంలో.. లేటెస్ట్ గా భూపేష్ జీ కూడా లిక్కర్ ను తలకు రాసుకున్నట్టు దాదాపుగా తేల్చేసారు. మాజీ సిఏం కుమారుడి నివాసంలో ఈడీ సోదాలు చేసి.. పెద్ద ఎత్తున గాలించింది.
Also Read : కలవలేదు.. అయినా కలిస్తే తప్పేంటి..?
చైతన్య భాగేల్ నివాసంలో ఈడీ అధికారుల తనిఖీలు చేసారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ప్రతినెలా రూ.2,161 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. మద్యం సిండికేట్ ద్వారా వసూళ్లు చేసినట్టు గుర్తించారు. రూ.205 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మరిన్ని సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ జైలుకు వెళ్ళారు. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఆయనతో పాటు తీహార్ జైల్లో ఉన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ పై కూడా లిక్కర్ స్కాం నింద ఉంది. త్వరలోనే మరికొందరిని ఈ వ్యవహారంలో చూడవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు.