Wednesday, February 4, 2026 11:23 PM
Wednesday, February 4, 2026 11:23 PM

రాహుల్ బెర్త్ ఖరారు.. సెంచరీతో ప్రమోషన్ పక్కా..!

భారత జట్టులో కెఎల్ రాహుల్ బ్యాటింగ్ స్థానం ఎక్కడ..? జట్టులో చోటు ఖాయమే కాని బ్యాటింగ్ ఎక్కడ..? ఇది అతని అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏ స్థానంలో అయినా ఆడగలిగే సత్తా ఉండటమే అతనికి మైనస్ అయిందనేది అభిమానులను వేధిస్తోన్న ప్రశ్న. జట్టులో యువ ఆటగాళ్ళు వచ్చి చోటు ఖరారు చేసుకుంటున్నా సరే రాహుల్ మాత్రం.. ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడో క్లారిటీ ఉండదు. ఓపెనర్ గా, వన్ డౌన్, నాలుగవ స్థానం.. లోయర్ ఆర్డర్ ఇలా ఎన్నో స్థానాల్లో రాహుల్ కు బ్యాటింగ్ సామర్ధ్యం ఉంది.

అందుకే రాహుల్ ను జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి. ఆస్ట్రేలియా పర్యటనలో ఓపెనర్ గా రాహుల్ ఆకట్టుకున్నాడు. కాని మళ్ళీ తనని మిడిల్ ఆర్డర్ కు పంపారు. ఛాంపియన్స్ ట్రోఫీలో మిడిల్ బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. మళ్ళీ ఇంగ్లాండ్ సీరీస్ రానే వచ్చింది. మరి అతని బ్యాటింగ్ స్థానం ఏదీ..? ఈ టైం లో రోహిత్ శర్మ రిటైర్ కావడంతో రాహుల్ నెత్తిన పాలు పోసింది. అతను ఎంతగానో ప్రేమించే ఓపెనర్ గా ఆడే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.

సేనా మైదానాలు అంటే పండుగ చేసుకునే రాహుల్.. ఇంగ్లాండ్ తో తొలి మ్యాచ్ లో దుమ్ము రేపాడు. మొదటి ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీ ముందు అవుట్ అయిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్ లో అత్యంత క్లిష్ట పరిస్థితిలో బ్యాటింగ్ కు దిగాడు. పిచ్ నుంచి ఏ మాత్రం సహకారం లేని సమయంలో.. సహచరుల వికెట్ లు కోల్పోతున్న టైం లో విశ్వరూపం చూపించాడు. దాదాపు 250 బంతులు ఆడిన రాహుల్.. 137 పరుగులు చేసాడు. ఇంగ్లాండ్ లో మరో సెంచరీ నమోదు చేసాడు. దీనితో అతనికి టెస్ట్ జట్టులో ఓపెనర్ గా స్థానం ఖరారు అయినట్టే. రోహిత్ శర్మ కూడా లేకపోవడం, ఆ స్థానానికి అతను సరిగా సూట్ అవ్వడంతో జట్టు యాజమాన్యం కూడా సాహసం చేయకపోవచ్చని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్