Friday, September 12, 2025 01:08 PM
Friday, September 12, 2025 01:08 PM
roots

పంత్ కు ఫిదా అయిపోయిన ఇంగ్లీష్ ఫ్యాన్స్

భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న నాలుగో టెస్ట్ ఆసక్తిగా మారుతోంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. బజ్ బాల్ ట్రీట్మెంట్ దెబ్బకు భారత బౌలర్లు ఇబ్బంది పడ్డారు. ఇక రెండవ రోజు ఆటలో ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ హైలెట్ అయ్యాడు. మొదటి రోజు రివర్స్ స్వీప్ ఆడే క్రమంలో గాయపడిన పంత్, ఆ తర్వాత బ్యాటింగ్ కు రావడం కష్టమని భావించారు అందరూ. కాని అనూహ్యంగా పంత్ ను జెర్సీలో డ్రెస్సింగ్ లో రూమ్ లో చూడటంతో అందరూ షాక్ అయ్యారు.

Also Read : సాయి సుదర్శన్ పై ఇంగ్లీష్ ఫ్యాన్స్ ఓవరాక్షన్

గాయంతో ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ వచ్చాడు పంత్. తన వంతుగా విలువైన పరుగులు జోడించాడు. పంత్ బ్యాటింగ్ చేస్తాడని బోర్డ్ ప్రకటించిన కాసేపటికే శార్దుల్ ఠాకూర్ వికెట్ పడటం, పంత్ బ్యాటింగ్ రావడం హైలెట్ అయింది. అతను మైదానంలో అడుగుపెట్టే ముందు శార్దుల్ ఠాకూర్ అతని తలపై చేయి పెట్టి దీవించిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక పంత్ కూడా మైదానానికి దండం పెట్టుకుని అడుగుపెట్టాడు. పంత్ క్రీజ్ లోకి రావడం చూసి ఇంగ్లాండ్ ఆటగాళ్ళు షాక్ అయ్యారు.

Also Read : థాయిలాండ్ లో బయటపడిన వెయ్యేళ్ళ నాటి శివాలయం.. ఆధారాలు ఇవే..!

పంత్ వస్తున్న సమయంలో ఇంగ్లీష్ అభిమానులు స్టాండింగ్ ఓవెషన్ ఇవ్వడం కూడా హైలెట్ అయింది. వచ్చిన తర్వాత పంత్ కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. కాని పంత్ ను ఇంగ్లాండ్ టార్గెట్ చేయడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఇక పంత్ పై మాజీ క్రికెటర్లు ప్రసంశల వర్షం కురిపించారు. రిషబ్ పంత్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. పంత్ ధైర్యాన్ని చూసి సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేం స్మిత్ ను గుర్తు చేసుకున్నారు. అతను వేలు విరిగినా సరే బ్యాటింగ్ రావడం అప్పట్లో హైలెట్. ఇప్పుడు పంత్ కూడా దాదాపు అలాంటి పరిస్తితిలోనే బ్యాటింగ్ కు వచ్చాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్