ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన నాల్గవ టెస్ట్‌లో రెండవ రోజు మళ్ళీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు గాయపడిన రిషబ్ పంత్ పై ఇంగ్లీష్ బౌలర్ల కుట్రను ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మోంటీ పనేసర్ తప్పుపట్టాడు. టెస్ట్ మొదటి రోజు చివరి సెషన్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్ లో కుడి కాలి వేలికి గాయం కావడంతో 37 పరుగుల వద్ద రిటైర్డ్ అయిన పంత్, తన కుడి పాదంలో పగులు ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ మళ్ళీ బ్యాటింగ్‌కు వచ్చాడు. బ్యాటింగ్ చేస్తూ సింగిల్స్ పూర్తి చేయడానికి అతను ఇబ్బంది పడటం చూసిన ఎవరికైనా అతను గాయం వలన ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. అతను నడిచేటప్పుడు కూడా చాలా అసౌకర్యంతో కనిపించాడు.
Also Read : టూరిస్ట్ లకు శ్రీలంక గుడ్ న్యూస్.. వీసా ఫ్రీ..!
గాయం తరువాత రిషబ్ పంత్ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు ప్రేక్షకుల నుండి ఘన స్వాగతం లభించింది. పంత్ పోరాట స్ఫూర్తికి పనేసర్‌తో సహా మాజీ క్రికెటర్ల నుండి చాలా ప్రశంసలు లభించాయి, కానీ నొప్పితో ఇబ్బంది పడుతున్న పంత్ గాయపడిన పాదాన్ని (ముందు) యార్కర్‌లతో లక్ష్యంగా చేసుకున్నందుకు అనుభవజ్ఞుడైన స్పిన్నర్ ఇంగ్లీష్ బౌలర్లను తీవ్రంగా విమర్శించాడు.
అతను చాలా ధైర్యంగా బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. పాదంలో చీలిక ఉన్నా, దేశం కోసం పోరాటపటిమ ప్రదర్శిస్తూ ప్రమాదకరం అని తెలిసినా క్రీజులోకి వచ్చాడు. అలాంటి ఆటగాడిని మరింత గాయపరచకుండా బౌలింగ్ చేయడం క్రీడా స్పూర్తి అవుతుంది. కానీ ఇంగ్లీష్ బౌలర్లు గాతపడిన అతని పదాన్ని టార్గెట్ చేసుకుని బౌలింగ్ చేయడం నిజంగా సిగ్గుచేటు అంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్తోక్స్ క్రీడా స్పూర్తిని సూటిగా ప్రశ్నించాడు పనేసర్. అలాంటి సమయంలో కూడా ఎలాంటి నిరుత్సాహాన్ని ప్రదర్శించకుండా అతను గొప్ప ధైర్యాన్ని చూపించాడు. గతంలో అనిల్ కుంబ్లే దవడ విరిగినప్పుడు, అతను జట్టు కోసం ఫీల్డ్ లోకి వచ్చి విరిగిన దవడ కి కట్టుకట్టుని బౌలింగ్ చేసిన విదాన్నాన్ని గుర్తుచేసుకున్నాడు. పంత్ ప్రదర్శన నాటి కుంబ్లే ప్రదర్శనకి ఏమాత్రం తగ్గదు అంటూ ప్రశంసించాడు. చేసిన దానికి సమానంగా ఉంటుంది.
Also Read : మార్చుకుంటారా.. లేదా.. లాస్ట్ వార్నింగ్..!
“కానీ, బెన్ స్టోక్స్ బృందం పంత్ పై వరసగా యార్కర్లు వేయడం నైతికమైనదా అని వారే ఆలోచించుకోవాలి. విరిగిపోయిన కాలి వేలుని టార్గెట్ చేసుకుని బౌలింగ్ చేయడంలోని వారి క్రీడా స్పూర్తిని పనేసర్ ప్రశ్నించాడు. పంత్ తన చివరి రాత్రి స్కోరుకి మరో 17 పరుగులు జోడించి 54 పరుగులు చేసి భారత తొలి ఇన్నింగ్స్ మొత్తాన్ని 358కి చేర్చడంలో సహాయపడ్డాడు. అయితే ఈ టెస్ట్ లో ఇప్పటికే ఇంగ్లాండ్ భారీ ఆధిక్యంతో ఉండటంతో వారు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.