Friday, September 12, 2025 08:54 PM
Friday, September 12, 2025 08:54 PM
roots

తిరుమలలో ఇక వారితోనే సరిపెడతారా…?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. నిత్యం వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. లక్షల మంది తిరుమల చేరుకుంటున్నారు. ఇక స్వామి వారి హుండీ ఆదాయం రోజు రోజుకూ రికార్టులు సృష్టిస్తోంది. ఇదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేల మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య ఇప్పుడు టీటీడీకి పెద్ద సవాల్‌గా మారింది. వాస్తవానికి టీటీడీలో ప్రస్తుతం దాదాపు 15 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. వివిధ విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొండపైన, కొండ కింద కూడా చాలా విభాగాల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స్థానాల్లో కొత్త వారి నియామకం జరగటం లేదనేది ఉద్యోగస్తుల మాట.

Also Read : మనోజ్ ను ఇంత దారుణంగా కొట్టారా…? గోళ్ళతో గీరింది ఎవరు…?

అయితే చాలా వరకు తిరుమలలో పనులన్నీ కూడా శ్రీవారి సేవకులతోనే సరిపెడుతున్నారనే మాట ఇప్పుడు టీటీడీ ఉద్యోగులను కలవరపరుస్తోంది. వారం రోజుల పాటు శ్రీవారి సేవ చేసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తులు పోటీ పడుతున్నారు కూడా. దీంతో 15 మందిని ఓ గ్రూప్‌గా చేసి టీటీడీ అదికారులు సేవకు వారం రోజుల పాటు అనుమతిస్తున్నారు. ఇలా వచ్చిన వారికి ఒకరోజు మాత్రం టెంపుల్ డ్యూటీ వేస్తూ… మిగిలిన రోజుల్లో వివిధ విభాగాల్లో సేవకు అవకాశం ఇస్తున్నారు. సుప్రభాత సేవ మొదలు… ఏకాంత సేవ సమయం వరకు స్వామి వారిని నిత్యం సుమారరు 70 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. వీరి కోసం టీటీడీ ప్రత్యేక క్యూ లైన్లు, అన్నప్రసాదాలు ఏర్పాటు చేసింది.

అయితే శ్రీవారి సేవకులను ముఖ్యంగా వివిధ విభాగాల్లో వినియోగిస్తున్నారు. జీడిపప్పు సేవ, క్యూ లైన్ నిర్వహణ, అన్న ప్రసాదం, చెప్పుల స్టాండ్, పుస్తక విక్రయం, లడ్డూ కౌంటర్, మాఢ వీధులు, నవనీత సేవ, కల్యాణ కట్ట, నాదనీరాజనం, వసతి గదుల కేటాయింపు… ఇలా వివిధ విభాగాల్లో శ్రీవారి సేవకులు విధులు నిర్వహిస్తున్నారు. ఇక వీటితో పాటు పరకామణి సేవ విధులు కూడా సేవకులే చేస్తున్నారు. దీంతో ఆయా పోస్టులను టీటీడీ ఏ మాత్రం భర్తీ చేయటం లేదు. అన్నదాన భవనంలో ఒక్కో షిఫ్ట్‌కు హాల్‌కు కనీసం 30 మంది ఉద్యోగులు కావాలి. కానీ ప్రస్తుతం కేవలం 8 నుంచి 10 మంది మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారు. మిగిలిన వారంతా శ్రీవారి సేవకులే.

Also Read : ఆ నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసే నాథుడే కరువు…!

ఇదే మాదిరిగా మిగిలిన అన్ని విభాగాల్లో విధులు నిర్వహించేంది సేవకులే. ఐదుగురు పని చేయాల్సిన విభాగంలో ఒకరు మాత్రమే టీటీడీ ఉద్యోగి. మిగిలిన నలుగురు శ్రీవారి సేవకులే. వారం రోజుల పాటు సేవకు వచ్చిన వారికి ఉచిత బసతో పాటు ఒకరోజు స్వామి దర్శన భాగ్యం కలిగిస్తోంది టీటీడీ. దీంతో సేవకు ఎక్కువగా మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. 15 మంది సభ్యులున్న గ్రూప్‌లో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పురుషులు వస్తున్నారు. మిగిలిన వారంతా మహిళలే. వీరితోనే టీటీడీ అన్ని పనులు చేయిస్తోంది. ఇదే విధానం కొనసాగిస్తే.. టీటీడీలో శాశ్వత ఉద్యోగుల నియామకానికి పూర్తిగా మంగళం పాడినట్లే అవుతుందనేది ప్రస్తుత ఉద్యోగుల్లో ఉన్న మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్