ఆరోగ్యకరమైన జీవనశైలికి తగినంత నిద్ర అత్యంత కీలకం. నిద్ర అనేది శారీరక, మానసిక ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రోజుల్లో నిద్ర లేమి అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఉరుకుల పరుగుల ప్రపంచంలో కనీసం 7 గంటలు పడుకోవడం కూడా కష్టంగా మారుతోంది. నిద్ర లేకపోతే మైండ్ పని చేయకపోవడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఇది కారణం అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే తాజాగా విడుదల చేసిన కొన్ని నివేదికల్లో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
Also Read : ఇదేందయ్యా… వదిన అలా.. మరిది ఇలా..!
తగినంత నిద్ర లేకపోతే గుండె జబ్బులు లేదంటే గుండెపోటు వచ్చే అవకాశాలను రెట్టింపు చేసే అవకాశం ఉందని హెచ్చరించ్చారు. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటివి ఉన్న వారికి నిద్ర చాలా అవసరం అని తేల్చారు. పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు 1,344 మందిపై ఈ పరిశోధనలు చేసి.. ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారు ల్యాబ్‌లో ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయేవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అని గుర్తించారు.
Also Read : ఏబీ వెంకటేశ్వరరావు కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ఈ విషయాలను ప్రచురించారు. ప్రధాన పరిశోధకుడు జూలియో ఫెర్నాండెజ్-మెండోజా మాట్లాడుతూ.. మీ శరీరంలో గుండె జబ్బుల ప్రమాద కారకాలు ఉంటే మాత్రం నిద్ర విషయంలో జాగ్రత్తా ఉండాలని.. తగినంత నిద్ర లేకపోతే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని ఆయన సూచించారు. నిద్రలో ఆటంకాలు లేకుండా చూడాలని.. నిద్రా భంగం కూడా అనేక సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు.