Tuesday, October 28, 2025 04:21 AM
Tuesday, October 28, 2025 04:21 AM
roots

సీన్ లోకి ఈడీ..? కేటిఆర్ తక్కువ అంచనా వేసారా..?

తెలంగాణలో ఇప్పుడు భారత రాష్ట్ర సమితి భవిష్యత్తుపై ఆ ఒకరకంగా ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ ను అరెస్టు చేయడం ఆ పార్టీకి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు చాలా వరకు భావించారు. రాజకీయంగా ఇది తమకు కచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. అందుకే కేటీఆర్ కూడా పదేపదే తనను అరెస్టు చేయాలని… సీఎం రేవంత్ రెడ్డికి ఒక రకంగా సవాల్ చేశారు. దీని ద్వారా రేవంత్ రెడ్డిని ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు.

కానీ అసలు దీని వెనక ఏం జరుగుతుందనేది మాత్రం కేటీఆర్ అంచనా వేయలేకపోయారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారత రాష్ట్ర సమితి భవిష్యత్తు కేటీఆర్ అరెస్టు వ్యవహారంతో కచ్చితంగా ప్రశ్నార్థకం అయ్యే ఛాన్స్ కనబడుతోందనే అభిప్రాయం వినపడుతోంది. దీని వెనక బలమైన కారణమే ఉండవచ్చు అని చాలామంది అంచనా వేస్తున్నారు. ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ విషయంలో ఎంటర్ అయింది.

Also Read : ఐ లవ్ యూ.. బుగ్గలు రుద్దను.. తలపై ముద్దులు పెట్టను: పవన్ కామెంట్స్

ఏకంగా కేటీఆర్ పై నమోదు చేసిన కేసు వివరాలను పూర్తిస్థాయిలో తమకు అందించాలని అలాగే ఫిర్యాదు చేసిన వ్యక్తి ఫిర్యాదును కూడా తమకు పంపించాలని… అలాగే ఏ బ్యాంకు నుంచి అయితే లావాదేవీలు జరిగాయో ఆ లావాదేవీలు కూడా తమకు అందించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏసీబీ అధికారులకు లేఖ రాసింది. దీనితో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేగింది. అంటే ఈ వ్యవహారంలో కచ్చితంగా కేంద్రం కూడా ఎంటర్ అయినట్లుగానే కనపడుతుంది.

దీనితో కేటీఆర్ కచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉండొచ్చనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడటానికి కచ్చితంగా ఈ వ్యవహారాన్ని వాడుకునే అవకాశం ఉందని.. అవసరమైతే కేటీఆర్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అదుపులోకి తీసుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తనను అరెస్టు చేసే విషయంలో చాలావరకు రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసిన కేటీఆర్ ఇప్పుడు కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని క్లియర్ గా అర్ధమవుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్