ప్రపంచాన్ని ఏదోక వైరస్ భయపెడుతూనే ఉంది. కరోనా, మంకి పాక్స్, నిఫా, ఎబోలా వైరస్ ఇలా ఏదొకటి ప్రపంచాన్ని కంగారు పెడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలకు ఈ వైరస్ లు చెమటలు పట్టిస్తున్నాయి. తాజాగా మరో వైరస్ మన దేశాన్ని కలవరపెడుతోంది. కేరళలోని రెండు జిల్లాల్లో జూనోటిక్ వ్యాధికి సంబంధించి రెండు పాజిటివ్ కేసులు గుర్తించారు. దీనినే నిపా వైరస్ అని పిలుస్తారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ నిపా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ప్రజలకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : భారత్ వ్యవసాయంపై ట్రంప్ దెబ్బ..!
కోజికోడ్, మలప్పురం మరియు పాలక్కాడ్ జిల్లాల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు కేసుల కాంటాక్ట్ లిస్ట్‌లో 400 మందికి పైగా ఉన్నారని.. పూణేలో పరిక్షలు చేసిన తర్వాత ఈ రెండు కేసులను గుర్తించామని ప్రభుత్వం తెలిపింది. పరిస్థితిని అదుపు చేయడానికి, కనివ్ 108 ఫ్లీట్‌తో సహా అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు. ప్రభావిత ప్రాంతాల్లో జ్వరంపై నిఘా పెట్టారు. ఈ వైరస్ ప్రాణాంతకమనే ఆందోళనల నేపధ్యంలో.. వైరస్ బయటపడిన ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.
Also Read : ఐటీ హబ్‌గా వైజాగ్… లోకేష్ కృషికి కంపెనీలు ఫిదా…!!
నిపా వైరస్ అనేది అత్యంత ప్రాణాంతకమైన జూనోటిక్ వైరస్ గా చెప్తారు. ఇది జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. మెదడు వాపు, శ్వాసకోశ సమస్యలతో పాటుగా మరణాలకు కూడా కారణంగా మారుతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ను మొట్టమొదట 1999లో మలేషియాలో గుర్తించారు. కేరళలో, 2018లో ఈ వ్యాధి 18 మంది ప్రాణాలు తీసింది. నిపా వైరస్ యొక్క ప్రారంభ లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, తలతిరగడం వంటివి. గబ్బిలాలు తిన్న పండ్లను తినడం ద్వారా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. ఈ వైరస్ కు ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో లేదు.