Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

రోడ్డెక్కిన దువ్వాడ కుటుంబ పంచాయితీ.. కూతురు చెప్పిన నిజాలు

వైసీపీ నాయకుల వ్యక్తిగత వ్యవహారశైలి ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతల వ్యక్తిగత వ్యవహారాలు ఇప్పుడు బజారుకి ఎక్కుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులను కూడా లెక్క చేయని కొందరికి ఇప్పుడు వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి ఆయనపై న్యాయ పోరాటానికి దిగారు. గత ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసిన ఆమె ఇప్పుడు తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టెక్కలిలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవి ఆందోళన కొనసాగిస్తున్నారు.

అర్థరాత్రి దువ్వాడ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రి గేట్ గడియ పగలగొట్టి దువ్వాడ నివాస ప్రాంగణంలోకి ప్రవేశించిన వాణి, హైందవి… ఇంటి ప్రధాన ద్వారం తలుపులను కట్టర్ తో కట్ చేసి ఇంటిలోకి ప్రవేశించే యత్నo చేసారు. వాణితో పాటు దువ్వాడ నివాసంకి వచ్చిన వాణి తల్లిదండ్రులు, సోదరి.. శ్రీనివాస్ బయటకు రావాలని డిమాండ్ చేసారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దువ్వాడ శ్రీనివాస్… తన భార్యపై అసభ్య పదజాలం వాడుతూ విరుచుకుపడ్డారు. వాణి, ఆమె కుటుంబ సభ్యులకు… శ్రీనివాస్ కు మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

Also read : బాబు సంచలన నిర్ణయం.. పేర్లన్నీ మార్చేశారు

ఆవేశంతో చేతికందిన కర్రని తీసుకుని వాణిపైకి దూసుకెళ్ళిన ఎమ్మెల్సీని పోలీసులు అడ్డుకున్నారు. కేకలు, తిట్లతో దువ్వాడ రెచ్చిపోయారు. దువ్వాడ నివాసం వద్ద భారీగా మోహరించి ఉన్న పోలిసులు, అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక భార్య వాణి, కుమార్తె తో పాటు ఆమెతో పాటు ఇంట్లోకి బలవంతంగా వచ్చే ప్రయత్నం చేసిన ఆమె అనుచరులపైన పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ ఫిర్యాదు చేయగా తనపైన, తన కుమార్తె పైన దాడి చేశారంటూ దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులకు వాణీ ఫిర్యాదు చేసారు. మరి వీరి వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, మరెంతమంది వ్యక్తిగత విషయాలను బయటకు తీసుకొస్తుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్