Friday, September 12, 2025 05:21 PM
Friday, September 12, 2025 05:21 PM
roots

దువ్వాడకు డీజే మోత ఖాయమా..?

దువ్వాడ జగన్నాథం సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అందులో డీజే అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ కూడా. అయితే తెలుగు రాష్ట్రాల్లో డీజే అంటే మాత్రం ఆ రాజకీయనేత మాత్రమే గుర్తుకు వస్తారు. నాలుగు పార్టీలు మారినప్పటికీ… అసలు తనే జగన్‌కు వీరాభిమాని అని… జగన్ చెబితే చావడానికి అయినా సిద్ధమే అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే మీడియా ముందుకు వచ్చి సవాళ్లు విసరడంతో పాటు… జగన్ పై వల్లమాలిన అభిమానం వలకబోస్తూ కన్నీరు కూడా పెట్టుకుంటారు. ఇంతకీ ఆయనెవరో తెలిసిందా… ఎవరో కాదు.. ఆయనే దువ్వాడ శ్రీనివాస్.

Also Read : షూటింగ్ లో రెబల్.. కానీ రిలీజ్ ఎప్పుడు…?

ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళీ అరెస్టు తర్వాత నెక్ట్స్ లైన్‌లో ఉన్న వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దువ్వాడ పదవీ కాలం మరో ఏడాదిన్నర ఉంది. వైసీపీలో పదవి కావాలంటే… ప్రతిపక్ష నేతలను దూషించాలి.. వారిపై దాడులు చేయాలనే కండిషన్‌ను దువ్వాడ సరిగ్గా అమలు చేశాడు. దీంతో వరుసగా రెండుసార్లు ఓడినప్పటికీ… దువ్వాడను ఎమ్మెల్సే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశాడు జగన్. ఇక పదవి అడ్డం పెట్టుకున్న దువ్వాడ మరింత రెచ్చిపోయాడు. ఓ ప్రజాప్రతినిధి ఇంటిపై దాడికి యత్నించాడు. చివరికి రాయలేని భాషలో మీడియా, పోలీసులు, అధికారులతో పాటు ప్రజల ముందే బహిరంగంగా కత్తులు పట్టుకుని మరీ… రా రా.. నా కొ… అంటూ మంత్రి అచ్చెన్నాయుడుకు సవాల్ కూడా విసిరారు.

Also Read : ఆ ఒక్క అరెస్ట్ ఎందుకు ఆగుతున్నట్టు…?

ఇక ఓ ప్రజాప్రతినిధి అనే కనీస విషయం కూడా మర్చిపోయిన దువ్వాడ శ్రీనివాస్.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ను దుర్భాషలాడాడు. చివరికి వ్యక్తిత్వ హననానికి చేసేందుకు కూడా దువ్వాడ వెనుకాడలేదు. జగన్ వీరాభిమాని అని చెప్పుకునే దువ్వాడ రాజకీయ ప్రస్తానం అంతా జంపింగులే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన దువ్వాడ.. 2001లో శ్రీకాకుళం జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత 2006లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ అండతో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. 2009లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చిరంజీవి నా దేవుడు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు దువ్వాడ.

Also Read : మార్చొద్దు.. ఏపీ బిజేపి చీఫ్ పై చంద్రబాబు ఒపినియన్…!

ఆ ఎన్నికల ప్రచారంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తూ చేసిన వీడియోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. 2009లో ఓటమి తర్వాత ఒక్కసారిగా సైలెంట్‌గా సైడ్ అయిపోయిన దువ్వాడ… సడన్‌గా తెలుగుదేశం పార్టీలో చేరారు. కేవలం 3 నెలలు మాత్రమే దువ్వాడ టీడీపీలో కొనసాగారు. కింజరాపు కుటుంబాన్ని కాదని తనకు టెక్కలి టికెట్ వచ్చే అవకాశం లేదని భావించిన దువ్వాడ… 2013లో జై జగన్ అనేశాడు. నాటి నుంచి జగన్నామస్మరణతో భజన చేస్తూ… తాను మాత్రమే నిజమైన వైసీపీ కార్యకర్త అని… అసలు జగన్ మాత్రమే తనకు రాజకీయ జీవితం ఇచ్చాడనేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు వ్యవహరిస్తాడు కూడా.

Also Read : కర్ణాటకలో గోరంట్ల మాధవ్.. రక్షణ కల్పిస్తోంది ఎవరూ…?

2014లో టెక్కలి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత 2019లో శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. మళ్లీ 2024లో టెక్కలి నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు దువ్వాడ. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దువ్వాడ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తొలి నుంచి నోటి దురుసుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న దువ్వాడపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్‌పై పలుచోట్ల ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా… దువ్వాడ అరెస్టు ఖాయమన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను విమర్శిస్తే ఎలా ఊరుకుంటామని ముందే వార్నింగ్ కూడా ఇచ్చారు నాదెండ్ల.

Also Read: చంద్రబాబుపై జీవీ రెడ్డి వ్యాఖ్యలు.. ఇదేంటి మళ్లీ..!

దీంతో దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు దాదాపు ఖాయమన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న దువ్వాడను అరెస్టు చేయాలంటే ముందుగా మండలి చైర్మన్ అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత గవర్నర్ కూడా దానికి ఆమోదించాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. తర్వాత కూడా ఓ ఎమ్మెల్సీ అరెస్టు అంటే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. ఇవేవీ లేకుండా చూడాలంటే… దువ్వాడ అరెస్టు మరో ఏడాది వాయిదా ఖాయమనేది ప్రభుత్వ పెద్దల మాట. ఇప్పటికే పిన్నెల్లి, వల్లభనేని, పోసాని అరెస్టు తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు దువ్వాడ శ్రీనివాస్. మరి చట్టసభలో కొనసాగుతున్నాడు కాబట్టి.. కొద్ది రోజులు ఆగుతారా… లేదంటే.. ముందే పని కానిస్తారా అనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్