Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

మరో వివాదంలో సింగర్ మంగ్లీ..!

హైదరాబాద్‌ శివార్లలో పార్టీ అంటే చాలు.. అందులో మద్యం ఏరులై పారాల్సిందే. అంతటితో సరిపెట్టుకోవటం లేదు. డ్రగ్స్, ముంజా, రేవ్, గంజాయి వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక సెలబ్రేటీల పార్టీలు అంటే.. ఇవన్నీ సర్వ సాధారణం. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలాంటి పార్టీలపై రైడ్ జరిగినా సరే.. సెలబ్రేటీల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. మత్తు పదార్థాల వినియోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

Also read : కృష్ణంరాజు.. దీనవ్వ తగ్గేదెలా..!

తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకలు ఇప్పుడు హాట్ టాపిక్. ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ.. పలు సినిమాల్లో కూడా నటించి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. మంగ్లీ పాడిన పాటలు సూపర్ హిట్ అవ్వడంతో ఆమె డిమాండ్ భారీగా పెరిగింది. సెలబ్రేటీల పెళ్లిలలో ఈవెంట్ ఆర్గనైజ్ కోసం లక్షలు వసూలు చేస్తున్నారు. ఆమె చెల్లెలు కూడా ఇప్పుడు స్టార్ సింగర్. ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ల వీడియోలు యూ ట్యూబ్‌లో టాప్‌లోనే ట్రెండ్ అవుతున్నాయి.

మంగ్లీ తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్‌లో కేవలం 50 మంది సన్నిహితులతోనే ఈ వేడుకలు జరుపుకున్నారు మంగ్లీ. ఈ వేడుకకు మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీకి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చేవెళ్ల పోలీసులు.. త్రిపుర రిసార్ట్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున విదేశీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనుమతి లేకుండా డీజే ప్లే చేస్తున్నందుకు కేసు నమోదు చేశారు.

Also read : కూటమి.. పొత్తు ధర్మం పాటిస్తారా లేదా..?

ఈ దాడుల్లో పోలీసులకు భారీ ఎత్తున గంజాయి లభించినట్లు తెలుస్తోంది. సెలబ్రెటీలు పాల్గొన్న ఈ వేడుకల్లో మొత్తం 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా.. అందులో 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే అనుమతి లేకుండా బర్త్ డే పర్టీ నిర్వహించినందుకు మంగ్లీ పైన, త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ నిర్వాహకులపై పోలీసులు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మంగ్లీకి గత వైసీపీ ప్రభుత్వం అధికార లాంఛనాలతో సత్కరించింది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ కోసం పాటలు పాడారు. అలాగే పలు బహిరంగ సభల్లో కూడా జగన్ అంటే తనకు అభిమానమని ప్రకటించారు. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీబీసీ ఛానల్‌కు గౌరవ సలహాదారుగా నియమించారు. కానీ ఐదేళ్ల పాటు పదవిలో ఉన్న మంగ్లీ.. ఏ రోజు ఒక్క సలహా కూడా ఇవ్వలేదు. కానీ లక్షలకు లక్షలు జీతం మాత్రం తీసుకున్నారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. జగన్ అంటే అభిమానం అని ప్రకటించిన మంగ్లీని కూటమి ప్రభుత్వం కూడా అక్కున చేర్చుకుంది. ఇటీవల అరసవల్లిలో జరిగిన రథసప్తమి వేడుకల్లో మంగ్లీకి భారీ పారితోషికం ఇచ్చారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా దగ్గరుండి మరీ స్వామి వారి దర్శనం కల్పించారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్