అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ మధ్య వాతావరణం మరింత వేడెక్కింది. ఈ ఇద్దరి మధ్య వైరం ఆదివారం మరింత పెరిగింది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కు సహకరించిన మస్క్.. గత కొన్నాళ్ళుగా అధ్యక్షుడిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ట్రంప్ తో విభేదించి కొత్త రాజకీయ పార్టీ కూడా స్థాపించారు. దీనిపై డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రిపబ్లికన్ టెస్లా, మరియు స్పేస్‌ఎక్స్ బాస్ “ట్రైన్ రెక్”గా మారుతున్నారని, అమెరికాలో మూడవ రాజకీయ పార్టీ ఎప్పటికీ విజయం సాధించదన్నారు.
Also Read : ఉగ్రవాదులకు బరా బర్ మద్దతు ఇస్తాం.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన కామెంట్స్
గత ఐదు వారాలలో ఎలోన్ మస్క్ పూర్తిగా పట్టాలు తప్పిన రైలుగా మారిపోయారు అని.. ఆయన రైలు శిథిలాలుగా మారడం చూసి నేను బాధపడ్డానని ట్రంప్ కామెంట్ చేసారు. ఇది గందరగోళం సృష్టించడం మినహా మరొకటి కాదని మండిపడ్డారు ట్రంప్. మూడవ పార్టీని ప్రారంభించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేసారు. అమెరికా ఎల్లప్పుడూ రెండు పార్టీల వ్యవస్థ అని.. బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను వ్యతిరేకించడం మస్క్ చేసిన తప్పు అంటూ మండిపడ్డారు ట్రంప్. నేను దీనిపై రెండు సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాను అని.. ఆ విషయం మస్క్ కు తెలుసు అన్నారు ట్రంప్.
Also Read : ఆ విషయంలో అంత తొందర ఎందుకు..?
ప్రతీ సందర్భంలోనూ దాని గురించి తాను మాట్లాడినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని మస్క్ ను నిలదీశారు. 2024లో అధ్యక్షుడిగా మళ్ళీ పోటీ చేస్తున్న సమయంలో.. మిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన మస్క్, ట్రంప్ కోసం తన ఉద్యోగులను సైతం ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను ఆమోదించిన కాంగ్రెస్ సభ్యులు అందరూ.. రాబోయే ఎన్నికల్లో ఇబ్బందిపడక తప్పదని మస్క్ వార్నింగ్ ఇచ్చారు.