Friday, September 12, 2025 06:47 PM
Friday, September 12, 2025 06:47 PM
roots

21 వసారి ట్రంప్ ఓవరాక్షన్.. సైలెంట్ గానే మోడీ

ప్రపంచ దేశాలను భయపెట్టే విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి రోజు రోజుకు తీవ్రమవుతునే ఉంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలను వాణిజ్య ఒప్పందాల పేరుతో భయపెట్టాలని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ట్రంప్ తన ఖాతాలో వేసుకుని భారత్ ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం చూసాం. తాజాగా మరోసారి డోనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : తెలుగు వాడి కెరీర్ ప్రమాదంలో పడిందా..?

కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమని ట్రంప్ 21వ సారి వ్యాఖ్యలు చేసారు. యుద్ధం కొనసాగిస్తే రెండు దేశాలు తమతో వ్యాపారాలు చేయవద్దని హెచ్చరించాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ సహా విదేశాంగ శాఖ కూడా సైలెంట్ గా ఉండటంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 59 రోజుల్లో కనీసం 21వ సారి ట్రంప్ దీనిపై వ్యాఖ్యలు చేసినా సరే మోడీ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. మాట్లాడే ధైర్యం లేదా అని నిలదీశారు.

Also Read : భారత్ వ్యవసాయంపై ట్రంప్ దెబ్బ..!

ఇదిలా ఉంచితే భారత్ – పాకిస్తాన్ విషయంలో అమెరికా వాణిజ్య ఒప్పందం అతి త్వరలో ప్రకటించబోతున్నట్లు ట్రంప్ ప్రకటన చేసారు. ఇప్పుడు, మేము యునైటెడ్ కింగ్‌డమ్‌తో, చైనాతో ఒప్పందాలు చేసుకున్నామని భారత్ తో కూడా ఒప్పందం చేసుకుంటున్నామని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్రంప్ జోక్యం చేసుకుని కాల్పుల విరమణ ఒప్పందం చేయించారని అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని డోనాల్డ్ ట్రంప్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్