Friday, September 12, 2025 09:34 PM
Friday, September 12, 2025 09:34 PM
roots

డాల్ఫిన్లు ఎందుకు వచ్చాయి..? వాటికి పేర్లు కూడా ఉంటాయా…?

భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సహా నలుగురిని భూమి మీదకు తీసుకొచ్చిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌక సముద్రంలో ల్యాండ్ అయిన సమయంలో చుట్టూ కనపడిన డాల్ఫిన్లు ఎంతగానో కనువిందు చేశాయి. దీనికి సంబంధించిన వీడియో ని నాసా బయట పెట్టింది. పిలవని అతిధులు ఆహ్వానించడానికి వచ్చాయని నాసా ఆ వీడియోకి ఒక క్యాప్షన్ కూడా రాసింది. అయితే ఇప్పుడు ఆ డాల్ఫిన్లు అక్కడికి ఎందుకు వచ్చాయి అనే దానిపై పరిశోధకులు అనేక ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నారు.

Also Read : ఫలించిన నల్లమిల్లి పోరాటం.. పరుగులు పెడుతున్న ప్రభుత్వ యంత్రాంగం…!

డాల్ఫిన్ ల మనస్తత్వాన్ని కూడా వివరిస్తున్నారు. సాధారణంగా డాల్ఫిన్లు గుంపులుగా జీవిస్తాయి. అవి చాలా తెలివైనవి కూడా. దానికి తోడు వాటికి కుతూహలం కూడా ఎక్కువేనట. సముద్రాల్లో నౌకలు కనిపించగానే వాటి వద్దకు వెళ్లి.. సందడి చేస్తాయట. అలాగే కొన్నిసార్లు నౌకలతో పోటీపడుతున్నట్లుగా.. వాటి ముందు భాగంలో ఈత కొడుతూ కనిపిస్తాయి. సముద్రంలో ఏదైనా పెద్ద వస్తువు కనపడినప్పుడు దాని వద్దకు వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అవి ఇంట్రెస్ట్ చూపిస్తాయి.

Also Read : ఏపీ కొత్త పోలీస్ బాస్ పై వడపోత పూర్తి..!

దానికి తోడు చేపల మాదిరిగా ఇవి లోతులో నివసించవు. ఆక్సిజన్ కోసం తరచుగా సముద్రం ఉపరితలంపై ఈత కొడుతూ ఉంటాయి. పెద్ద నౌకలు సముద్రంలో ప్రయాణించినప్పుడు.. వాటి వద్దనే డాల్ఫిన్లు కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. నౌకలు వెళ్లే సమయంలో వచ్చే తరంగాలు వాటి ప్రయాణాన్ని సులువు చేయడంతో ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ దూరం వెళ్ళవచ్చు అని భావిస్తాయి డాల్ఫిన్లు. ఇక డాల్ఫిన్లు మనుషులు మాదిరిగానే పేర్లు పెట్టుకుంటాయట.

Also Read : తమ్మినేనికి మ్యూజిక్ స్టార్ట్ అయిందా…?

ఆ పేర్లతోనే పిలుచుకుంటాయని పరిశోధకులు చెప్తున్నారు. ఒక ఈల లాంటి శబ్దంతో ఒక డాల్ఫిన్ మరో డాల్ఫిన్ ను పిలుస్తుందట. అప్పట్లో గ్రీకు నావికులు డాల్ఫిన్ కనపడితే ఒక పవిత్ర జంతువు కనపడినట్లుగా భావించేవారు. నౌక ఎంత దూరం ప్రయాణం చేసినా.. ఆ నౌకతో పాటుగా అవి కూడా ప్రయాణిస్తూ సందడి చేస్తూ ఉంటాయి. వినోదం ఎక్కువగా కోరుకునే జీవుల్లో డాల్ఫిన్ మొదటిది అని పరిశోధకులు చెప్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్