2019 కి ముందు జగన్ చేసిన ఎన్నికల ప్రచారం మీకు గుర్తుండే ఉంటుంది. అసలు ఏది మాట్లాడాలన్నా సరే ఏదో చిన్న పేపర్ మాత్రమే చేతిలో ఉండేది. ప్రసంగాలు మాత్రం ఏ పేపర్ చూడకుండా చేసేవారు. అవి కూడా పవర్ ఫుల్ ప్రసంగాలు. మాస్ ఆడియన్స్ ని క్లాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఉండేది ప్రదర్శన. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత కథ మొత్తం రివర్స్ అయింది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాస్తా జూనియర్ ఆర్టిస్ట్ అయ్యారు. అప్పటి ప్రదర్శన చూసి జగన్ ను ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఫోన్ నొక్కుతూ టీవీ చూస్తున్నారు.
కరోనా సమయంలో అనుకుంట లైవ్ అని చెప్పి జగన్ అప్పటికే మాట్లాడిన ఒక వీడియోని ఎడిట్ చేసి వదిలారు. ప్రతిపక్ష నేతలు లైవ్ మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడిన సమయంలో జగన్ మీడియా లేకుండా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు అంటూ వీడియోలు వచ్చేవి. 5 ఏళ్ళు ప్రెస్ మీట్ ఏ చూడలేదు జనాలు. ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో కూడా జగన్ అలాగే ఉన్నారు. ఎవరైనా మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతుంటే పట్టరాని కోపం వస్తుంది జగన్ కు. నన్ను పొమ్మంటారా అంటూ రివర్స్ అయిపోతున్నారు.
Read Also : బాబు విషయంలో సైలెంట్.. జగన్ విషయంలో వైలెంట్
అది విడ్డూరమే… ఇదేం రాచరికం కాదు జగన్ రాజు కాదు. మీడియా ప్రశ్నలు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అడుగుతుంది. చెప్పే సత్తా ఉంటేనే మీడియా ముందుకు రావాలి ఉంది. నిన్న కూడా అంతే జగన్ మూడు గంటలకు ప్రెస్ మీట్ అన్నారు. ఫైనల్ గా వచ్చింది లైవ్ వీడియోనే. ఆ లైవ్ వీడియోలో ఉన్నత చదువు చదివిన జగన్… ఇంగ్లీష్ చూసి కూడా చదవలేదు. దీనితో అసలు 2019 కి ముందు మాట్లాడిన జగన్ ఎక్కడ అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఆయనే ఈయనా… ఈయనే ఆయనా…సినిమాల్లో చూపించినట్లు జగన్ కి బాడీ డబుల్ ఉన్నారా.. అసలు జగన్ ఎక్కడ అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.