ప్రకృతిలో మనకు ఎన్నో ఔషధాలు దొరికినా.. కొన్ని విషయాల్లో మనం అర్ధం చేసుకోలేక లైట్ తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనలను ఇబ్బంది పెట్టె దీర్ఘకాలిక సమస్యలకు.. ప్రకృతిలోనే అద్భుతమైన వైద్యం దొరుకుతుంది అనే విషయాన్ని చాలా మంది అర్ధం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారి కోసం.. ఓ గుడ్ న్యూస్. షుగర్ ఉందని జామ కాయ తినని వారికి.. జామ ఆకులు ఎంతో అద్భుతంగా పని చేస్తాయని, జామ ఆకులతో షుగర్ ను కంట్రోల్ చేయడం చాలా ఈజీ అంటున్నారు నిపుణులు.
Also Read : కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న జీఎస్టీ..?
వాస్తవానికి డయాబెటిస్ అనేది మీ శరీరం రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడే ఇన్సులిన్ అనే హార్మోన్‌ను సమర్థవంతంగా ఉత్పత్తి చేయలేని సమయంలో వచ్చే అనారోగ్యం. అందుకే ఇన్సులిన్ ను మందుల రూపంలో తీసుకుంటూ ఉంటారు. అందుకు వైద్య సహాయం తీసుకోకుండా వదిలేస్తే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడంతో గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బతినడం, నరాల సమస్యలు, దృష్టి సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు వచ్చే ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.
Also Read : మీరు మారేది ఎప్పుడు.. మార్పు రాదా..?
షుగర్ ను కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా అవసరం. అయితే షుగర్ ను కంట్రోల్ చేయడంలో జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయట. జామ ఆకులలో రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసే సమ్మేళనాలను కలిగి ఉన్నాయని నిపుణులు అంటున్నారు. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో జామ ఆకుల సారాలు రక్తంలో షుగర్ ను పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. లక్షణాలను సైతం కంట్రోల్ చేస్తుందట. క్లినికల్ ట్రయల్స్, అధ్యయనాల తర్వాత జామ ఆకు టీ ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుందని తేల్చారు. సుమారు 10 నుండి 15 నిమిషాలు నానబెట్టి, ఆపై టీని వేడిగా లేదా చల్లగా ఆస్వాదించవచ్చట. జపాన్ వంటి దేశాల్లో షుగర్ విషయంలో.. జామ ఆకు టీ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు.