ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఐదేళ్ల నిర్లక్ష్యం తర్వాత అమరావతి పనులను పట్టాలెక్కించారు సీఎం చంద్రబాబు. 2027 నాటికి అమరావతిలో తొలి దశ నిర్మాణాలు పూర్తి చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. అమరావతిలో పనులను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతను మంత్రి నారాయణకు అప్పగించారు. ఇక అమరావతి తొలి భవనం సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం త్వరలో ప్రారంభం కానుంది. ఇక అమరావతిలో జనవరి 2026 నుంచి క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు కూడా.
Also Read : మరో భారత్.. పాక్ పోరు చూస్తామా..?
అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన నాటి నుంచి వైసీపీ నేతలు, అభిమానులు పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముంపు ప్రాంతమని, అలల రాజధాని అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అమరావతికి ఎలాంటి ముంపు లేదంటున్నారు ప్లానింగ్ కమిటీ సభ్యులు. అటు ప్రభుత్వం కూడా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులంటూ వ్యాఖ్యానించారు జగన్. దీనిపై ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి మాట మార్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామన్నారు. దీంతో కొద్ది రోజులుగా వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో అమరావతిపై ఆరోపణలు చేయటం లేదు.
ఇక ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణీ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో అయితే ప్రతి రోజు సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. దీని వల్ల ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిపోతోంది. ఇక నగరంలోని రహదారులన్నీ జలమయం అవుతున్నాయి. భారీ వర్షాలకు నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు గుంటూరు కూడా రికార్డు స్థాయి వర్షం కారణంగా రెండు రోజుల పాటు ప్రజలు నానా పాట్లు పడ్డారు.
Also Read : ఆ ఇద్దరి మధ్య మళ్లీ వార్ మొదలైందా..?
ఏపీ సర్కార్ అమరావతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రపంచస్థాయి నగరంగా నిర్మితమవుతున్న అమరావతిలో ఎంత భారీ వర్షం వచ్చినా సరే నిమిషాల్లో నీరంతా వెళ్లిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తుున్నారు. సుమారు పది అడుగుల ఎత్తున్న పైపులను డ్రైనేజ్ కోసం అమరుస్తున్నారు. దీని వల్ల ఎంత వరద నీరు వచ్చినా సరే.. క్షణాల్లో దిగువకు వెళ్లిపోతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇప్పటికే అండర్ గ్రౌండ్ కేబుల్ వర్కులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక డ్రైనేజ్ పైపులు తీసుకువచ్చిన లారీలు అమరావతి ప్రాంతంలో బారులు తీరాయి. దీంతో అమరావతికి ఎలాంటి ముంపు సమస్య రాదంటున్నారు నిపుణులు.