Saturday, September 13, 2025 04:46 AM
Saturday, September 13, 2025 04:46 AM
roots

డీఎస్పీతో మైత్రీ కట్..!

మైత్రీ మూవీ మేకర్స్… పదేళ్ల కాలంలోనే టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ. మైత్రీతో పనిచేసే అవకాశం కోసం టాప్ టెక్నీషియన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అలాంటి మైత్రీ తో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు బంధం దాదాపు తెగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పుష్ప 2 సినిమా మైత్రీ, డీఎస్పీ కాంబినేషన్ లో లాస్ట్ మూవీ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

Also Read : కమర్షియల్ బాలయ్య… అమెరికా లెవెల్ థింకింగ్

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో రామ్ పోతినేని నటిస్తున్న కొత్త సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయం కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తో సినిమా అంటే హిట్ అనే టాక్ ఉంది. రోమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా రామ్ – మైత్రీ సినిమా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో మ్యూజిక్ కు మంచి ప్రయారిటీ ఉంటుందంటున్నారు. గతంలో రామ్ – డీఎస్పీ కాంబోలో మంచి సూపర్ హిట్స్ వచ్చాయి కూడా. దీంతో ఈ సినిమాకు కూడా దేవీ మ్యూజిక్ చేస్తాడేమో అని అంతా భావించారు.

Also Read : పెద్దిరెడ్డి కోసం పవన్ భారీ ప్లాన్….!

కానీ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం డీఎస్పీని కాదని కొత్త పేరు ప్రకటించారు. వివేక్ – మెర్విన్ అనే తమిళ సంగీత ద్వయం పేర్లు ప్రకటించారు. దీంతో డీఎస్పీ – మైత్రీ బంధం తెగిపోయిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పుష్ప 2 బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో గొడవ మొదలైంది. చివరికి చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రెడిట్ ఎవరూ ఇవ్వరని, మనమే లాక్కోవాలంటూ దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. అందుకే దేవీశ్రీ తో తన బంధాన్ని మైత్రీ కట్ చేసుకుందనే మాట ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్