Monday, October 20, 2025 01:17 AM
Monday, October 20, 2025 01:17 AM
roots

వైసీపీ నుంచి మరో సీనియర్ అవుట్..!

వైసీపీ ఓడిన తర్వాత ఆ పార్టీకి వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీకి దూరమవుతున్నారు. కొందరు ఇతర పార్టీల్లో చేరుతుంటే.. జగన్‌కు అత్యంత ఆప్తుల్లో ఒకరైన విజయసాయిరెడ్డి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో ముద్దాయిలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. ఇక మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్, ఆళ్ల నాని, గుమ్మనూరు జయరామ్ వంటి నేతలు నీకూ దండం సామీ అని జగన్‌‌కు దూరమయ్యారు.

Also Read : మమ్మల్ని కూడా గుర్తించండి సార్..!

వైసీపీలో నిన్నటి వరకు చక్రం తిప్పిన నేతలంతా క్రమంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతున్నారు. తొలి రోజు నుంచి జగన్ వెంటే ఉన్న కొడాలి నాని, పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్ వంటి నేతలు ఇప్పుడు రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నారు. ఒకరిద్దరు నేతలు మాత్రం తమ స్థానంలో తమ వారసులకు అవకాశం ఇవ్వాలని కోరుతుండగా.. మిగిలిన వాళ్లు మాత్రం మాకెందుకీ రాజకీయాలు అని రెస్ట్ తీసుకుంటున్నారు.

ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు అన్న నీకో నమస్కారం అని జగన్‌తోనే స్వయంగా చెప్పేశారు. ఇంక మా వల్ల కాదు అని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక నిన్నటి వరకు సీనియర్లుగా చెప్పుకునే పేర్ని నాని ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో కుమారుడు పేర్ని కిట్టూ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు కూడా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Also Read : యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ నుంచి ఈఎంఐ పేమెంట్..!

ఇక ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, ధర్మాన సోదరులు కూడా ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. రాబోయే ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్‌ను కోరారు. నిజానికి ధర్మాన సోదరులు మొన్నటి ఎన్నికల్లోనే తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరారు. కానీ జగన్ మాత్రం ససేమిరా అనటంతో తప్పని సరి పరిస్థితుల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే తాజాగా ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పటికే 70 ఏళ్లు దాటాయని.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు చైతన్యకు అవకాశం ఇస్తారేమో చూడాలన్నారు. తనకు సహకరించిన నరసన్నపేట నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం కష్టమన్నారు. గతంలో ఉన్న పరిస్థితులు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వేరన్నారు కృష్ణదాస్. ఇదే విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు కృష్ణదాస్ తెలిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్