దేవి శ్రీ ప్రసాద్… తెలుగు సినిమాలో సంగీతాన్ని ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. రాక్ స్టార్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. ఇలాంటి డీఎస్పీకి ఇప్పుడు కోపం వచ్చింది. అందుకే బహిరంగ వేదిక పైనే ఏకంగా నిర్మాత పైనే కామెంట్లు చేశారు. నా తప్పేం లేదు… కానీ నన్ను ఎందుకు అంటున్నారు అని అర్ధం వచ్చేలా నిర్మాతపై నిప్పులు చెరిగారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్మాతలు చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక పైకి వచ్చిన దేవి శ్రీ ప్రసాద్… సైలెంట్‌గానే సెటైర్లు వేశారు. అల్లు అర్జున్ తన చిన్ననాటి మిత్రుడని, దర్శకుడు సుకుమార్ వల్ల తనకు ఎంతో పేరు వచ్చిందన్న దేవి… పుష్ణ 2 సినిమా విషయంలో మాత్రం నిర్మాతలకు తనపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్నారు.
Also Read : జగన్ నిర్ణయంతో కంగారులో వైసీపీ నాయకులు
అలాగే మనకు రావాల్సింది ఏదైనా డిమాండ్ చేసి లాక్కుని తీసుకోవాలని… అది ప్రేక్షకుల నుంచి అభిమానమైనా సరే… నిర్మాత నుంచి డబ్బులైనా సరే అంటూ డీఎస్పీ చేసిన కామెంట్లు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. పుష్ప 2 సినిమా నుంచి డీఎస్పీని తప్పించారనే వార్తలే ఈ దుమారానికి ప్రధాన కారణం. పాటలు మాత్రం డీఎస్పీ ఇచ్చినప్పటికీ… బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్‌తో పాటు మరో ఇద్దరు సంగీత దర్శకులు అందిస్తున్నారనే విషయమే డీఎస్పీ ఆగ్రహానికి కారణం. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో 3 పాటలను విడుదల చేశారు. వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చేసింది.
అయితే బ్యాగ్రౌండ్ స్కోర్, బీజీఎం విషయంలో దర్శకుడు సుకుమార్ అంత హ్యాపీగా లేరని… పైగా స్కోర్ ఇవ్వడంలో దేవి లేట్ చేశాడని నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బ్యాగ్రౌండ్ కోసం కొత్తగా ముగ్గురిని తీసుకున్నట్లు వార్తలు టాలీవుడ్‌లో ప్రచారంలో ఉన్నాయి. ఈ పుకార్లకు దేవి స్వయంగా బ్రేక్ చెప్పేందుకు చెన్నై ఈవెంట్‌ను వేదికగా చేసుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాత నవీన్ ఎర్నేని పేరు ప్రస్తావిస్తూ… “మీకు నా మీద చెప్పలేనంత ప్రేమ, అభిమానం ఉన్నాయి… అలాగే నా మీద మీ దగ్గర చాలా ఫిర్యాదులు కూడా ఇన్నాయి. ప్రేమ ఉన్న దగ్గరే ఫిర్యాదులుంటాయి. అయితే నా విషయంలో మాత్రం అభిమానం కంటే కూడా ఫిర్యాదులే ఎక్కువ ఉన్నట్లున్నాయని తెలుస్తోంది.
Also Read : ఇలాంటి శాసనసభని గతంలో ఎప్పుడైనా చూశామా..?
రాంగ్ టైమింగ్, నేను ఆలస్యం అని మీరు ఉన్నారు… దానికి నేనేం చేయమంటారు… 25 నిమిషాల ముందే ఇక్కడికి వచ్చా… అయితే నన్ను లోపలికి రానివ్వలేదు. అడిగితే కెమెరా రావాలి ఎంట్రీ కోసం… అని ఆపేశారు.. నాకేమో కెమెరాలంటే సిగ్గు…” అంటూ డీఎస్పీ అన్న మాటలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. మైత్రీ మూవీస్ వంటి పెద్ద సంస్థ నిర్మాతలను ఓ వేదికపై నుంచే డీఎస్పీ తప్పుబట్టారని… కాబట్టి డీఎస్పీ కెరీర్ క్లోజ్ అనే మాట ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.