ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి గట్టిగానే జరుగుతుంది. పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తికాగా.. ఇప్పుడు కీలకమైన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరికి చోటు దక్కుతుంది అనేదానిపై పెద్ద చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ నుంచి ఇప్పటికే నాగబాబు ఖరారు కాగా టిడిపి నుంచి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇందులో ప్రధానంగా వినపడుతున్న పేర్లు.. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి పక్కాగా ఎమ్మెల్సీ స్థానం దక్కి అవకాశం ఉంది.
Also Read : సాయి రెడ్డి పదవి ఫైనల్ అయిపోయినట్టే..?
కృష్ణ – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దేవినేని ఉమా గట్టిగానే కష్టపడ్డారు. ఆలపాటి రాజా విజయం కోసం ఉమా క్షేత్ర స్థాయిలో గట్టిగానే ప్రచారం నిర్వహించారు. తనకు పట్టున్న ప్రాంతాల్లో దేవినేని ఉమా పార్టీ విజయం కోసం కృషి చేయడంతో ఆయనకు ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. ముందు నారా లోకేష్ తో దేవినేని ఉమాకు విభేదాలు ఉన్నాయి అనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు ఆలపాటి రాజ విజయం కోసం.. ఉమా కష్టపడటాన్ని పార్టీ సానుకూలంగా తీసుకుందని టాక్.
Also Read : కూటమి కసరత్తు.. ఎమ్మెల్సీ కుంపటిలో టీడీపీ
దీనితో ఆయనకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి దక్కవచ్చు అంటూ రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధపై కూడా పార్టీ అధిష్టానం సానుకూలంగానే ఉంది. 2019 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పార్టీ కోసం వంగవీటి రాధాకు పనిచేశారు. 2004లో చివరిసారి ఎమ్మెల్యే అయిన వంగవీటి రాధ.. ఇప్పటివరకు శాసనసభలో గానీ ఎమ్మెల్సీగా గానీ అడుగు పెట్టలేదు. కాపు సామాజిక వర్గంలో ఆయనకు మంచి మద్దతు ఉండటంతో ఖచ్చితంగా వంగవీటి రాధను ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. మరి ఎమ్మెల్సీ పోరులో వంగవీటి వర్సెస్ దేవినేని పోరు ఎలా ఉంటుందో చూడాలి.