Friday, September 12, 2025 11:02 PM
Friday, September 12, 2025 11:02 PM
roots

న్యాయమూర్తి కాదు అవినీతి మూర్తి.. సంచలనం అవుతున్న ఢిల్లీ న్యాయమూర్తి వ్యవహారం..

అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్ళను న్యాయవ్యవస్థ శిక్షిస్తుంది అనే మాట మనం వింటూనే ఉంటాం. దోషులను కఠినంగా శిక్షించడానికి మన భారత రాజ్యాంగం పగడ్బందీగా రచించారని అప్పుడప్పుడు రాజకీయ నాయకులు, మాజీ న్యాయమూర్తులు చేసే ప్రసంగాలు సైతం వింటూనే ఉంటాం. కానీ అలాంటి న్యాయవ్యవస్థలో బయటపడుతున్న కొన్ని పెద్ద తిమింగలాలను చూసి జనాలు షాక్ అవుతున్నారు. దోషలను రక్షించేందుకు న్యాయమూర్తులు కూడా లంచాలు తీసుకుంటున్నారు అనే ఆరోపణలు ఎప్పటినుంచో వినపడుతూనే ఉన్నాయి.

Also Read : పెట్టుబడుల విషయంలో బాబు వ్యూహం వర్కౌట్ అవుతుందా..?

అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం దాదాపు 100 కోట్ల రూపాయలు తీసుకునేందుకు ఓ జడ్జి ఆసక్తి చూపించడం.. ఆ తర్వాత ఆ విషయం వెలుగులోకి వచ్చి జాతీయస్థాయిలో సంచలనం కావడం చూసాం. ఇప్పుడు ఓ జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు చూసి అగ్నిమాపక సిబ్బంది షాక్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో ఒక అగ్నిప్రమాదం జరిగింది. భారీ అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలు భారీగా ఉండటంతో ఇంట్లోకి వెళ్లి అదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read : వైసీపీలో ఫుల్ స్క్రాప్.. జగన్‌కు సినిమా..!

ఆ ఇంట్లో అగ్నిమాపక సిబ్బంది చూసిన సీన్ కళ్ళు బైర్లు కమ్మేలా ఉంది. యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు చూసిన అగ్నిమాపక సిబ్బంది స్థానిక అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఢిల్లీలోనే కావడంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. దీనితో చీఫ్ జస్టిస్ సంజయ్ కన్నా నేతృత్వంలోని కొలీజియం వెంటనే అత్యవసర సమావేశం నిర్వహించింది. యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అంతేకాకుండా ఆయనపై అంతర్గత విచారణకు సైతం సుప్రీంకోర్టు ఆదేశించింది. యశ్వంత్ వర్మ వ్యవహారం న్యాయవ్యవస్థ నిబద్ధతను దెబ్బతీసే విధంగా ఉందంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆయనను కఠినంగా శిక్షించాలని కొలీజీయంలోని ఇతర సభ్యులు డిమాండ్ చేసినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్