Sunday, February 8, 2026 07:54 PM
Sunday, February 8, 2026 07:54 PM

ఈరోజు (07-08-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయణం వర్ష ఋతువు, శుక్లపక్షం నాడు పన్నెండు రాశుల్లో ఇవాళ (7 ఆగస్టు 2025 గురువారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం…

మేషం 07-08-2025

దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాల విస్తరణకు నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

—————————————

వృషభం 07-08-2025

ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయటా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దైవ చింతన కలుగుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

—————————————

మిధునం 07-08-2025

గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారమున లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగ సమస్యలు తొలగుతాయి. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

—————————————

కర్కాటకం 07-08-2025

ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. బంధువులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు.

—————————————

సింహం 07-08-2025

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించనప్పటికి అవసరానికి ధనం అందుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి.

—————————————

కన్య 07-08-2025

భూ సంభంధిత వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.

—————————————

తుల 07-08-2025

చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఊహించని రీతిలో నిరుద్యోగులకు అవకాశములు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

—————————————

వృశ్చికం 07-08-2025

నూతన భూ గృహ యోగమున్నది.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండిబాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి.

—————————————

ధనస్సు 07-08-2025

ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రుణదాతల ఒత్తిడితో నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన శిరోబాధను కలిగిస్తుంది.

—————————————

మకరం 07-08-2025

కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అనుకున్న వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో రావలసి అవకాశాలు చేజారుతాయి.

—————————————

కుంభం 07-08-2025

వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తు లాభలు పొందుతారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు.

—————————————

మీనం 07-08-2025

చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున కొన్ని వ్యవవహారాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కుల చిచ్చు కోసం...

రాజకీయాల్లో కులాలు మతాలు అనేవి ఈ...

సిగ్గు సిగ్గు.. జగన్‌...

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా...

నమ్మకం లేదు.. కానీ...

ఎవరి మీదైనా నమ్మకం లేకపోతే.. వాళ్లు...

ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.....

కల్తీ నెయ్యి వ్యవహారం, తిరుమల లడ్డూ...

తెలంగాణకు ఎవరు జాతిపిత..?

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా...

యాటిట్యూడ్ స్టార్‌.. “గుంజి...

సినిమా అంటే.. నలుగురు చూసేది.. అందులో...

పోల్స్