Friday, September 12, 2025 05:01 PM
Friday, September 12, 2025 05:01 PM
roots

ఈరోజు (08-07-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాడ మాసం.. ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం…

మేషం 08-07-2025

ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది.దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

వృషభం 08-07-2025

భాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

—————————————

మిధునం 08-07-2025

చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

—————————————

కర్కాటకం 08-07-2025

ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

—————————————

సింహం 08-07-2025

ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

—————————————

కన్య 08-07-2025

పాతరుణాల ఒత్తిడితో నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

—————————————

తుల 08-07-2025

సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. ధన ఆదాయం బాగుంటుంది.

—————————————

వృశ్చికం 08-07-2025

దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు కలసివస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి.

—————————————

ధనస్సు 08-07-2025

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడి అధికమౌతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోవటం మంచిది.

—————————————

మకరం 08-07-2025

వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

—————————————

కుంభం 08-07-2025

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది.

—————————————

మీనం 08-07-2025

రాజకీయ వర్గాల వారికీ పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.

————————————-

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్