Sunday, February 15, 2026 08:34 AM
Sunday, February 15, 2026 08:34 AM

ఈరోజు (27-11-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం 27-11-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 27-11-2025

వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారమున పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలుంటాయి.

—————————————

వృషభం 27-11-2025

దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి . ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు.

—————————————

మిధునం 27-11-2025

చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. బందు మిత్రులతో సక్యతగా వ్యవహారిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

—————————————

కర్కాటకం 27-11-2025

సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. దైవచింతన కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

 

—————————————

సింహం 27-11-2025

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

—————————————

కన్య 27-11-2025

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

—————————————

తుల 27-11-2025

పాత మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. రుణయత్నాలు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులుంటాయి.

—————————————

వృశ్చికం 27-11-2025

సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు నుండి బయటపడతారు.

—————————————

ధనస్సు 27-11-2025

పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

—————————————

మకరం 27-11-2025

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఋణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము వసూలవుతుంది. నూతన వస్తులాభాలు పొందుతారు. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది.

—————————————

కుంభం 27-11-2025

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

మీనం 27-11-2025

చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పవన్ ను ఎందుకు...

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం...

ఏపీ బడ్జెట్ విశేషాలు.....

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక...

అధినేతపై గుర్రుగా క్యాడర్.....

పార్టీ అధ్యక్షుడు ఎక్కడా..? అసలు ఆయన...

లోకేష్ కు జనసైనికులు...

నేటి రాజకీయాల్లో మాటకు మాట సమాధానం...

అంబటి దెబ్బ.. ఆ...

వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. మాజీ...

విజయవాడకు మెగా ప్రాజెక్టులు..!

కూటమి సర్కార్ ‌అధికారంలోకి వచ్చిన తర్వాత...

పోల్స్