Sunday, October 26, 2025 09:28 AM
Sunday, October 26, 2025 09:28 AM
roots

ఈరోజు (26-10-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయణం, శరదృతువు, శుక్లపక్షం 26-10-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 26-10-2025

దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

—————————————

వృషభం 26-10-2025

కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

—————————————

మిధునం 26-10-2025

వాహన అనుకూలత కలుగుతుంది. ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి.

—————————————

కర్కాటకం 26-10-2025

నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి.

—————————————

సింహం 26-10-2025

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.

—————————————

కన్య 26-10-2025

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. సహనంతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

—————————————

తుల 26-10-2025

ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. గృహమునకు చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.

—————————————

వృశ్చికం 26-10-2025

ఆర్థిక పరంగా ఒత్తిడులు తప్పవు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.

—————————————

ధనస్సు 26-10-2025

వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

—————————————

మకరం 26-10-2025

చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.

—————————————

కుంభం 26-10-2025

దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందువినోద కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి.

—————————————

మీనం 26-10-2025

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

————————————-

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

బుకింగ్ క్యాన్సిల్.. ప్రయాణికులకు...

సాధారణంగా ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం...

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

పోల్స్