శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయణం, శరదృతువు, బహుళ పక్షం 25-10-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.
మేషం 25-10-2025
బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించాలి. ఆలయాలు దర్శనాలు చేసుకుంటారు.
—————————————
వృషభం 25-10-2025
వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణదాతల నుండి ఒత్తిడులు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
—————————————
మిధునం 25-10-2025
మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి సభ, సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.
—————————————
కర్కాటకం 25-10-2025
ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందగలుగుతారు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
—————————————
సింహం 25-10-2025
వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి.
—————————————
కన్య 25-10-2025
విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగపరంగా అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిరుత్సాహ పరుస్తాయి.
—————————————
తుల 25-10-2025
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. విందు వినోదాది కార్యక్రమాలకు హాజరు అవుతారు.
—————————————
వృశ్చికం 25-10-2025
చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి కొన్ని పనులలో ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.
—————————————
ధనస్సు 25-10-2025
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.
—————————————
మకరం 25-10-2025
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం.
—————————————
కుంభం 25-10-2025
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
—————————————
మీనం 25-10-2025
కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు.
—————————————




