Thursday, February 5, 2026 03:10 AM
Thursday, February 5, 2026 03:10 AM

ఈరోజు (04-11-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయణం, శరదృతువు, శుక్లపక్షం 04-11-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 04-11-2025

ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగమున మార్పులు ఉంటాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

వృషభం 04-11-2025

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభ సూచలున్నవి.

—————————————

మిధునం 04-11-2025

ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి.

—————————————

కర్కాటకం 04-11-2025

సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

—————————————

సింహం 04-11-2025

వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

—————————————

కన్య 04-11-2025

ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవచింతన పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు.

—————————————

తుల 04-11-2025

ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.

—————————————

వృశ్చికం 04-11-2025

ఆస్తి వివాదాలు తొలగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక సమయంలో ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి.

—————————————

ధనస్సు 04-11-2025

ప్రముఖులతో సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషానిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

—————————————

మకరం 04-11-2025

చిన్నపాటి అనారోగ్యాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

—————————————

కుంభం 04-11-2025

కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

—————————————

మీనం 04-11-2025

ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరస్తి వివాదాలలో బయటపడటానికి ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

————————————-

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్