Monday, October 20, 2025 02:07 PM
Monday, October 20, 2025 02:07 PM
roots

ఈరోజు (30-09-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయణం వర్ష ఋతువు, శుక్లపక్షం 30-09-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 30-09-2025

ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

—————————————

వృషభం 30-09-2025

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

—————————————

మిధునం 30-09-2025

దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి.

—————————————

కర్కాటకం 30-09-2025

రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

—————————————

సింహం 30-09-2025

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

—————————————

కన్య 30-09-2025

వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.

—————————————

తుల 30-09-2025

నూతన వ్యాపారాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

—————————————

వృశ్చికం 30-09-2025

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి.

—————————————

ధనస్సు 30-09-2025

కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు.

—————————————

మకరం 30-09-2025

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరో బాధను కలిగిస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది.

—————————————

కుంభం 30-09-2025

వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థాన చలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు.

—————————————

మీనం 30-09-2025

వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

—————————————

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్