Friday, September 12, 2025 02:39 PM
Friday, September 12, 2025 02:39 PM
roots

ఈరోజు (12-09-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయణం వర్ష ఋతువు, శుక్లపక్షం 12-09-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 12-09-2025

ధన వ్యవహారాలు కలసి వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

—————————————

వృషభం 12-09-2025

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

—————————————

మిధునం 12-09-2025

ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు తప్పవు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సంతాన అనారోగ్య సమస్యలుంటాయి.

—————————————

కర్కాటకం 12-09-2025

కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

—————————————

సింహం 12-09-2025

నూతన వాహన యోగం ఉన్నది. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

—————————————

కన్య 12-09-2025

పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని బారం తప్పదు.

—————————————

తుల 12-09-2025

ఆదాయ వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. ఇంట బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసివస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి.

—————————————

వృశ్చికం 12-09-2025

ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో కాని పూర్తికావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్పదు.

—————————————

ధనస్సు 12-09-2025

నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

—————————————

మకరం 12-09-2025

ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.

—————————————

కుంభం 12-09-2025

మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

—————————————

మీనం 12-09-2025

ఇతరులకు మాటఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. పనులలో శ్రమపెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించక చికాకుపెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.

—————————————

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్