Wednesday, February 4, 2026 11:11 AM
Wednesday, February 4, 2026 11:11 AM

ఈరోజు (13-01-2026) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, బహుళ పక్షం 13-01-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…

మేషం 13-01-2026

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.

—————————————

వృషభం 13-01-2026

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఇంటా బయట కొందరి ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

—————————————

మిధునం 13-01-2026

బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్త్రీ సంబంధ వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో చిన్నపాటి వివాదాలు కలగుతాయి.

—————————————

కర్కాటకం 13-01-2026

కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ పడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

—————————————

సింహం 13-01-2026

వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ముఖ్యమైన పనులలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

—————————————

కన్య 13-01-2026

దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

—————————————

తుల 13-01-2026

వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది.

—————————————

వృశ్చికం 13-01-2026

నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

—————————————

ధనస్సు 13-01-2026

వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

—————————————

మకరం 13-01-2026

నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన పరంగా ఒడిదుడుకులు అదికమౌతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంత పెరుగుతుంది.

—————————————

కుంభం 13-01-2026

ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి.

—————————————

మీనం 13-01-2026

ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. వ్యాపారాల్లో నూతన విధానాలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్