గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘దేవర’. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందు రానుంది. ఇప్పటీకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు రెస్పాన్స్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 27 ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు అంచనాలను పెంచగా తాజాగా మూడో పాటను విడుదల చేసింది.
ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘‘దావుడి’’ అంటూ సాగే పాటను విడుదల చేస్తూ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక సాంగ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సాంగ్‌ను విడుదల చేశారు. పక్క మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తారక్ సొంత నిర్మణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ సంయక్తంగా నిర్మిస్తున్నారు.