Friday, September 12, 2025 07:11 PM
Friday, September 12, 2025 07:11 PM
roots

జంప్ డిపాజిట్… నయా సైబర్ క్రైమ్..!

సైబర్ కేటుగాళ్లు రోజుకో మార్గంలో రెచ్చిపోతున్నారు. ముందు కార్డు మోసాలు… తర్వాత లాటరీలంటూ ఈ మెయిల్స్.. డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులు.. ఇలా రోజుకో తీరున మోసాలు చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. దీనిపై పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా సరే.. కేటుగాళ్లు అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అమాయకులను రోజుకో రీతిలో మోసం చేస్తూనే ఉన్నారు. డిజిటల్ అరెస్టు అంటూ బెదిరింపు ఫోన్లకు పోలీసులకు చెక్ పెట్టడంతో తాజాగా… జంప్ డిపాజిట్ అంటూ కొత్త మార్గం ఎంచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు.

Also Read : ఏపీలో అన్నీ ఇక వాట్సాప్ లోనే…!

కార్డు రద్దవుతుందంటూ మొదలైన సైబర్ కేటుగాళ్ల మోసం… తారాస్థాయికి చేరుకుంది. చివరికి మీపై ఆర్థిక నేరం కేసు నమోదైంది… అరెస్టు తప్పదంటూ బెదిరించే వరకు చేరుకున్నారు. పాత కార్డు రద్దు అవుతుంది.. కొత్త కార్డు కోసం మీ బ్యాంకు వివరాలు చెప్పండి అనేది తొలినాళ్లలో జరిగిన మోసం. బ్యాంకు అధికారులే ఫోన్ చేశారని భావించిన అమాయకులు తెలియక వివరాలు చెప్పడంతో.. నైస్‌గా అకౌంట్ ఖాళీ చేసేశారు. ఆ తర్వాత లాటరీ తగిలిందంటూ మెయిల్ పంపడం ద్వారా ఆశ చూపించి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో లక్షలు నొక్కేశారు. దానిపై ప్రజల్లో అవగాహన రావడంతో.. డిజిటల్ అరెస్ట్ అంటూ రంగంలోకి దిగారు. బ్యాంకు లావాదేవీల్లో భారీగా అవకతవకలు జరిగాయి.. మీ పేరు మీద లోన్ ఉంది.. కేసు నమోదైంది అంటూ బెదిరించి… బ్యాంకు వివరాలు తెలుసుకుని డబ్బులు కాజేశారు. వీటిపై పోలీసులు విస్తృత అవగాహన చర్యలు చేపట్టారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే మాటే లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు కొత్త మార్గం ఎంచుకున్నారు కేటుగాళ్లు.

Also Read : అప్పుడు ఈ-వేలం కుంభకోణం అన్నారు.. ఇప్పుడు లీజులు ఇచ్చేస్తున్నారు

జంప్ డిపాజిట్… ప్రస్తుతం ఆన్‌లైన్ లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కరెన్సీ వినియోగం తగ్గించాలనే లక్ష్యంతో డిజిటల్ చెల్లింపులను కేంద్రం ప్రొత్సహిస్తోంది. చిన్న టీ కొట్టుకు వెళ్లినా సరే… డిజిటల్ చెల్లింపులే. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా వేల రూపాయలు బదిలీ చేసేస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం వీటిపై దృష్టి పెట్టారు. ముందుగా కొంత నగదును పంపిస్తారు. ఆ తర్వాత ఆ నెంబర్‌కు ఫోన్ చేసి బై మిస్టేక్ డబ్బులు వచ్చాయి.. వేరే నంబర్‌కు పంపాల్సిన డబ్బులు మీకు వచ్చాయి… అంటూ మాట కలుపుతారు. చాలా అత్యవసరం.. ఆసుపత్రి బిల్లు, పిల్లల ఫీజు డబ్బులంటూ బేలగా కబుర్లు చెబుతారు. మీకు లింక్ పంపిస్తాం… దానిపై క్లిక్ చేసి డబ్బులు తిప్పి పంపగలరు అంటూ రిక్వైస్ట్ చేస్తారు. సరే కదా అని లింక్ క్లిక్ చేసి.. నగదు బదిలీ చేసేందుకు పిన్ ఎంటర్ చేయగానే… సైబర్ కేటుగాళ్ల పని మొదలవుతుంది. తెలియకుండానే ఖాతాలోని నగదు మొత్తం ఖాళీ అవుతుంది. ఇదేంటని నంబర్‌కు కాల్ చేస్తే మాత్రం.. పని చేయటం లేదంటూ బదులు వస్తుంది.

Also Read : ఓవర్ కాన్ఫిడెన్స్.. ఓవరాక్షన్ వద్దు: చంద్రబాబు వార్నింగ్

హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాల్లో ఇప్పటికే ఈ తరహా కేసులు నమోదవుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరూ కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఈ తరహాలో డబ్బు పంపించినట్లు చెబితే… వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఎవరికీ ఓటీపీలు, పిన్ నంబర్లు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. జంప్ డిపాజిట్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్